విశ్వాసం చూపించిన వీధి కుక్క.. ఈ యువతిని ఎలా సర్‌ప్రైజ్ చేసిందంటే..

కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో భారతదేశమంతటా నగరాల్లో జనజీవనం స్తంభించిపోయింది.దీంతో జనాలు ఓ ముద్ద పెడితేనే బతికే కుక్కలు అల్లాడి పోయాయి.

వీటిని సంరక్షించేందుకు చాలా మంది ముందుకు వచ్చారు.ఈ క్రమంలోనే ఒక యువతి ఓ వీధి కుక్కకు అన్నం పెట్టింది.

అలా ఆమె ఆ వీధి కుక్కకు ఫుడ్ పెట్టి రెండేళ్లు గడిచిపోతోంది.అయితే మళ్లీ రెండేళ్ల తరువాత ఆ కుక్క ఆమెను చూసి గుర్తు పట్టింది.

యువతిని చాన్నాళ్ల తర్వాత అది గుర్తించి విశ్వాసం చూపింది.ఈ కుక్కకు తాను భోజనం పెట్టినట్లు ఆమెకు కూడా గుర్తు లేదు కానీ కుక్క ఆమె వద్దకు వచ్చి తోక ఊపుతూ పలకరించింది.

దాని విశ్వాసానికి ఆ యువతి ఒక్కసారిగా ఫిదా అయిపోయింది.ఒక్కసారి ఫుడ్ పెట్టిన కుక్కకి ఎంత విశ్వాసం ఉంటుందో చూడండి అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ పెట్టింది.

ఆ పోస్ట్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. """/"/ వివరాల్లోకి వెళితే.

ముంబై నగరంలోని అంధేరిలో ప్రియాంక చౌబల్ అనే యువతి లాక్‌డౌన్ సమయంలో ఓ స్ట్రీట్ డాగ్‌కి ఫుడ్ పెట్టింది.

మళ్లీ రెండేళ్ల తర్వాత అదే ప్రాంతంలో ప్రియాంక ఒక బస్సు మిస్ అయింది.

దాంతో బాగా నిరాశ పడ్డ ఆ యువతి సమీపంలో ఉన్న ఒక దేవాలయానికి వెళ్లి దుర్గాదేవి ఆశీర్వాదం పొందాలనుకుంది.

అయితే గుడికి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో ఆ వీధి కుక్క ప్రియాంకకు ఎదురైంది.ప్రియాంకని చూసి ఆ కుక్క వెంటనే గుర్తు పట్టింది అనంతరం తోక ఊపుతూ.

దగ్గరకొచ్చింది.దీన్ని చూసి ఆమె సర్‌ప్రైజ్ అయింది.

ఆపై తన బ్యాగ్‌లో ఉన్న బిస్కెట్స్‌ తీసి దానికి పెట్టింది.వైరల్ వీడియోలో వీధికుక్కని ఆమె ప్రేమతో తడమడం మీరు చూడవచ్చు.

అలానే ప్రియాంక తన కుక్కకి బిస్కెట్స్ పెట్టడం కూడా గమనించ వచ్చు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెను బాగా పొగుడుతున్నారు.

దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడా..?