అంతఃపురం సినిమాలో సౌందర్య ను ఎవరి బలవంతం పై తీసుకున్నారో తెలుసా ?

మామూలుగానే కృష్ణ వంశీ సినిమా అంటేనే ప్రకృతి మరియు అనుబంధాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

అయన ఒక సినిమా తీస్తున్నాడు అంటే ప్రతి మనిషి కి ఎంతో బాగా కనెక్ట్ అయ్యేలా ఖచ్చితంగా ఉంటుంది.

కెరీర్ మొత్తం మీద చేసిన సినిమాలు తక్కువే అయినా ప్రేక్షకులకు మదిని తాకే సినిమాలు చేసాడు.

ఇక కృష్ణ వంశీ దర్శకత్వం లో వచ్చిన అంతఃపురం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే.

1998 లో వచ్చిన ఈ మూవీ లో ఒక హీరో అనే వ్యక్తి ఎవరు ఉండరు.

కథను మాత్రమే నమ్ముకొని నిజజీవితాలకు దగ్గరగా, అందరికి అర్ధం అయ్యేలా తీర్చి దిద్దిన ఈ సినిమా కృష్ణ వంశీ కెరీర్ లో ఒక మంచి సినిమాగా నిలిచిపోయింది.

తమ్మారెడ్డి భరద్వాజ్ పర్యవేక్షణలో జెమినీ కిరణ్ నిర్మించిన ఈ సినిమాలో సౌందర్య, ప్రకాష్ రాజ్, సాయి కుమార్, శారదా ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇక ఈ సినిమా లో సౌందర్య పాత్ర చాల ఎమోషనల్ గా ఉంటుంది.

సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది.ఈ చిత్రంలో పాటలకు కూడా మంచి స్థానం ఉంది.

మరి ముఖ్యంగా అసలేం గుర్తుకు రాదు అంటూ వచ్చే పాట మొత్తం సముద్రం లోనే షూట్ చేయడం గమనార్హం.

"""/" / అయితే ఈ సినిమా కోసం కృష్ణ వంశీ మొదట ఒక బాంబే హీరోయిన్ ని సౌందర్య పాత్ర కోసం అనుకున్నారట.

కానీ తమ్మారెడ్డి సౌందర్య తప్ప ఎవరు ఆ పాత్రకు న్యాయం చేయరు అని చెప్పిన మొదట కృష్ణ వంశీ ఒప్పుకోలేదు.

కానీ తమ్మారెడ్డి ఖచ్చితంగా సౌందర్య కావాలని పట్టుబట్టడం తో కృష్ణ వంశీ తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది.

"""/" / కానీ సౌందర్య కాకుండా ఆ పాత్ర లో మరే హీరోయిన్ నటించిన కూడా మనకు అంతగా నచ్చేది కాదేమో.

ఒక్కోసారి మన జడ్జ్ మెంట్ కూడా తప్పవచ్చు అని నిరూపించిన ఘటన ఇది అంటూ ఇటీవల కృష్ణ వంశీ తమ్మారెడ్డి వ్యక్తి గత ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భం లో తెలిపాడు.

ఇక అంతఃపురం సినిమాకు అవార్డుల పంట పండింది, 1999 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రం గా, ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ నటిగా మూడు ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు తొమ్మిది నంది అవార్డులు కూడా దక్కాయి.

ప్రకాష్ రాజ్ కి నేషనల్ అవార్డు కూడా దక్కటం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ జోరు షురూ..!