గుడిలో మన ప్రవర్తన ఎలా ఉండాలి?
TeluguStop.com
గుడిలోకి వెళ్లినప్పుడు కొంత మంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు.కొందరు అబ్బాయిలు అమ్మాయిల్ని చూడడం, ఏడిపించడం వంటివి కూడా చేస్తుంటారు.
వారు తమను చూసేందుకు గట్టిగా అరవడం, నవ్వడం, కేకలు వేయడం, ఈలలు వేయడం వంటివి కూడా చేస్తుంటారు.
కానీ ప్రాపంచిక విషయాల గురించి ఎక్కువగా మాట్లాడడం చేయరాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
గుడి పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని వివరిస్తున్నారు.అక్కడికి వచ్చే వారికి ప్రశాంతత దక్కాలంటే.
గుడిలో ఎలాంటి గొడవలు పడకూడదని అంటున్నారు.అలాగే కొబ్బరి పెంకులు, అరటి తొక్కలు, ప్రసాదం తినగా మిగిలిన తుక్కు వంటివి గుడి ప్రాంగణంలో వేయరాదు.
అక్కడ నిబంధనల ప్రకారం నియమించిన తొట్టెల్లోనే వేయాలి.దైవ దర్శనం కోసం క్యూలో నిల్చున్నప్పుడు ముందుకు తోసుకుంటూ వెళ్లరాదు.
దేవుడిని కనులారా చూశాకే.కళ్లు మూస్కొని ప్రార్థన చేయాలి.
అలా కాకుండా దేవుడిని చూడకుండా కళ్లు మూస్కొని దేవుడిని మొక్క కూడదు.మనం అంత దూరం వెళ్లింది దేవుడిని చూసేందుకే కాబట్టి తనివితీరా స్వామి వారిని దర్శించుకోవాలి.
"""/"/
అలాగే గుడిలో నిల్చుని తీర్థం పుచ్చుకోవాలి.ఇంట్లో కూర్చుని తీర్థం పుచ్చుకోవాలి.
దీపారాధన శివునికి ఎడమ వైపూ, విష్ణువుకు కుడి వైపూ చేయాలి.అమ్మ వారికి నూనె దీపమయితే ఎడమ పక్కగా, ఆవు నేతి దీపమైతే కుడి వైపు వెలిగించాలి.
ఇలాంటి నియమాలు పాటిస్తే.పుణ్యంతో పాటు మనశ్శాంతి దక్కుతుంది.
మనశ్శాంతి, దైవ దర్శనం కోసం ఆలయానికి వచ్చే వారికి.ఎటువంటి ఇబ్బంది కల్గకుండా చూస్కోవాలి.
అధిక బరువు ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్ తింటే ఏమవుతుందో తెలుసా?