అత్యాశకు పోయిన రేలంగి.. చక్రపాణి ఇచ్చిన ట్విస్ట్‌తో షాక్..?

హాస్యనట సామ్రాట్ రేలంగి వెంకట్రామయ్య( Relangi Venkatramayya ) ఎన్నో అద్భుతమైన వేషాలు వేసి ఎంతగానో నవ్వించారు.

సింగర్ గా కూడా ఎంతోమందిని ఆకట్టుకున్నారు.పాతాళ భైరవిలో "తాళలేను నేతాళలేను", "వినవే బాల నా ప్రేమ గోల" అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

మిస్సమ్మలోని ధర్మం చేయి బాబు కాణి ధర్మం చేయి బాబు, సీతారామ్‌ సీతారామ్‌ సీతారాం జై సీతారాం వంటి పాటలు కూడా పాడి అలరించారు.

ఆయనకు పేరు తెచ్చిన సినిమాలన్నిటినీ దాదాపు నాగిరెడ్డి, చక్రపాణిలే ప్రొడ్యూస్‌ చేశారు.రేలంగి కారణంగా వారు బాగానే లాభపడ్డారని చెప్పుకోవచ్చు.

ఈ నిర్మాతలు రేలంగికి న్యాయంగానే రెమ్యునరేషన్ ఇచ్చేవారు.అయితే ఒకసారి ఈ హాస్యనటుడు అత్యాశకు పోయి చివరికి బాగా దెబ్బతిన్నారు.

అదెలాగో తెలుసుకుందాం. """/" / 1973లో బి.

నాగిరెడ్డి, చక్రపాణి కలిసి విజయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై "గంగ మంగ"( Ganga Manga ) అనే అనే ఒక కామెడీ ఫిలిం తీశారు.

ఇందులో వాణిశ్రీ గంగ, మంగగా ద్విపాత్రాభినయం చేసి తన సత్తా చాటింది.కృష్ణ, శోభన్‌బాబు హీరోలుగా నటించి మెప్పించారు.

ఇందులో వాణిశ్రీకి తండ్రిగా రేలంగిని తీసుకోవాలని చక్రపాణి( Chakrapani ) భావించారు.అంతేకాదు తన మేనేజర్‌ చేత రేలంగికి ఒక కబురు కూడా పంపించారు.

ఈ క్యారెక్టర్ చేసినందుకుగాను రూ.30,000 ఇస్తానని మేనేజర్ చెప్పారు.

అయితే రేలంగి రూ.30 వేలు కాదు కానీ రోజుకి రూ.

5,000 ఇస్తానంటే ఈ సినిమా చేస్తా అని బదులిచ్చారు.అదే మాట మేనేజర్ చెప్పగా "దాందేముంది అలానే ఇచ్చేద్దాంలే" అని తాపీగా అన్నారు చక్రపాణి.

"""/" / తన ఇష్ట ప్రకారమే డబ్బులు ఇస్తానని అనడంతో రేలంగి ఈ మూవీ చేయడానికి ఒప్పుకున్నారు.

అయితే చక్రపాణి రేలంగితో తీయాల్సిన సన్నివేశాలను ఒక భాగంగా విభజించారు.వాటిని కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేశారు.

అనంతరం రోజుకు రూ.5,000 చొప్పున మూడు రోజులకు రూ.

15,000 అయ్యాయని లెక్క కట్టి రేలంగి చేతిలో పెట్టారు.దాంతో రేలంగి బిక్క మొహం వేశారు.

రోజుకు రూ.5 వేల చొప్పున చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని అనుకుంటే అసలుకే మోసం వచ్చిందిగా, కానీ చక్కన్న నాకంటే తెలివిగా ఆలోచించారుగా అనుకుంటూ నిరాశ పడ్డారట.

అయితే చక్రపాణి ముందుగా 30,000 ఇస్తానని చెప్పినట్లే మరొక రూ.15 వేలు ఆయనకు ఇచ్చారట.

ఆ విధంగా చక్రపాణి సరదాగా రేలంగికి ఓ గుణపాఠం నేర్పించారు.

ధనుష్ రాజ్ కుమార్ పెరియాసామి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కథ ఇదేనా..?