అసలే సినిమాలు లేవు..అన్ని కోట్లు పెట్టి పూజ ఇల్లు ఎలా కొనిందబ్బా ?

అసలే ఓవైపు సినిమాలు లేవు.మరోవైపు చేస్తున్న సినిమాలకు హిట్స్ లేవు.

ఇలాంటి ఒక టైం లో మన బుట్ట బొమ్మ పూజ హెగ్డే( Pooja Hegde ) ముంబైలోనే చాలా కాస్ట్లీ ఏరియా అయినా బాంద్రాలో( Bandra ) 45 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఒక ఇల్లు కొనుక్కుంది.

దీంతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అందరూ ప్రస్తుతం పూజా హెగ్డే ఇంటి గురించే మాట్లాడుకుంటున్నారు.

సముద్రం ఫేసింగ్( Sea Facing House ) ఉన్న ఈ ఇంటికి వాస్తు కూడా చాలా అద్భుతంగా ఉందట.

మరి ఇంత కాస్ట్లీ ఏరియాలోని కోట్ల రూపాయలు పెట్టి పూజా హెగ్డే ఇల్లు కొనుక్కోవడానికి ఆమెకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ? పైగా ఇప్పుడు అసలు సినిమా అవకాశాలే లేవు కదా అని బాలీవుడ్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా ఈ అమ్మడు మాత్రం ఇప్పుడు కాస్త డల్ అయినా మొదట్లో బాగానే సంపాదించింది.

దాదాపు 15 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంది పూజా హెగ్డే. """/" / ఇన్నేళ్ల నుంచి కష్టపడిన డబ్బు పెట్టి ఇల్లు కొనుక్కుందేమో అని కూడా ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఇప్పుడు ప్రస్తుతానికి తన చేతిలో రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.అలాగే సౌత్ ఇండియా నుంచి కూడా రెండు సినిమాల డిస్కషన్ జరుగుతున్నాయట.

ఇక కొన్నేళ్లు వెనక్కి వెళితే టాలీవుడ్ లో ఏ సినిమా అనౌన్స్ అయినా అందులో పూజ హెగ్డే పేరు ఖచ్చితంగా ఉండేది.

వరుస పెట్టి అనేక సినిమాల్లో నటించింది.ఆఖరికి ఇప్పటి వరకు కెరియర్ లో ఒక్క సినిమా కూడా హిట్ అందుకొని అఖిల్ అక్కినేని కి( Akhil Akkineni ) కూడా ఓ విజయాన్ని ఇచ్చింది ఈ అమ్మడు.

ఓకే హీరోతో మళ్ళీ రిపీటెడ్ గా కూడా సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

"""/" / ప్రస్తుతం ఆమె నటిస్తున్న రెండు సినిమాల్లో ఒకటి విజయం సాధించిన పూజా హెగ్డే మళ్ళీ బిజీ కావడం ఖాయం.

మరోవైపు టాలీవుడ్ లో బాగా డిమాండ్ ఉన్న టైం లోనే బాలీవుడ్ కి( Bollywood ) వెళ్ళింది.

అక్కడ సక్సెస్ దొరక్క ఇక్కడ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అయినా ఆమె అంత డబ్బు పెట్టి ఇల్లు కొనుక్కోకూడదా అనే వర్గం కూడా ఉన్నారు.

పైగా ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలంటే ఎన్నో బ్యాంక్స్ లోన్ కూడా ఇస్తున్నాయి.ఆ మాత్రం దానికి పూజా హెగ్డే డబ్బులు లేకుండా ఇల్లు ఎలా కొనుక్కొని ఉంటుంది చెప్పండి అంటూ ఫైర్ అవుతున్నారు పూజ హెగ్డే ఫ్యాన్స్.

ఏది ఏమైనా ఈ అమ్మడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందన్నమాట .

డైరెక్టర్ హరి సూర్య కి హిట్టిచ్చినట్టుగా మిగితవాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు..?