Pawan Kalyan : మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం పవన్ కళ్యాణ్ పడ్డ కష్టాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నాడు అనే విషయం మనందరికీ తెలిసిందే.

ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూనే కదా శిక్షణ తీసుకున్నాడు అంతేకాదు కరాటే నేర్చుకోవడం కోసం చాలామంది సులభంగా నేర్చుకుంటారు.

కానీ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాత్రం అందుకోసం చాలా చెమటోడ్చాల్సి వచ్చింది తమిళనాడులో మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ తనకు కావలసిన వ్యక్తి దగ్గరే నేర్చుకోవాలని దృఢ సంకల్పంతో దాదాపు చాలా రోజులపాటు ట్రైనర్ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేశాడట.

ఎందుకంటే సదరు ట్రైనర్ అప్పటికే మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం మానేసి సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడట.

కానీ నేర్చుకుంటే అతని దగ్గరే నేర్చుకోవాలని లేకుంటే అక్కడ ఎదురు చూస్తానని చెప్పాడట.

"""/" / ఎంత చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ వినకపోయేసరికి సదరు ట్రైనర్ పవన్ కళ్యాణ్ కి కొన్ని కండిషన్స్ తో కూడిన ట్రైనింగ్ ఇచ్చాడట.

ఉదయం 5 గంటలకే ఇంటికి రావాలని అలాగే రాత్రి 11 వరకు తనతోనే ఉండాలని తనకు ఖాళీ ఉన్న సమయంలో ఒక అర్థగంట మాత్రమే నేర్పిస్తానని చెప్పాడట.

అందుకు పవన్ కళ్యాణ్ ఓకే అన్నాడట రోజు తెల్లవారుగానే వెళ్లి ట్రైలర్ ఇంటి ముందు ఎదురు చూసేవాడట అతనికి టీ పెట్టి ఇవ్వడం, కరాటే నేర్చుకునే ప్రదేశాన్ని శుభ్రపరచుకోవడం వంటి పనులన్నీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసుకునేవాడట.

పవన్ పేరు అప్పటివరకు కేవలం కళ్యాణ్ కుమార్ గానే ఉండేది అలా ఒక మూడు నెలలపాటు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సదరు ట్రైనర్ కి పవన్ కళ్యాణ్ గురించిన అసలు విషయం తెలిసిందట.

"""/" / మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) తమ్ముడు కళ్యాణ్ కుమార్ ఇతడే అని తెలియడంతో ఆ తర్వాత సీరియస్ గా ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడట.

అలా ఏడాది పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత బ్లాక్ బెల్ట్ అందుకున్నాడు పవన్ కళ్యాణ్ అయితే కళ్యాణ్ కుమార్ గా ఉన్న అతని పేరును పవన్ అని తనకు మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇచ్చిన ట్రేైనరే పెట్టాడట.

ఈ విషయాన్ని సదరు ట్రైనర్ సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టడంతో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఇంత కష్టపడ్డాడా అనే విషయాలు బయటకు వచ్చాయి.

పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఎవరికైనా సరే అడిగినంత డబ్బు ఇచ్చి ట్రైనింగ్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ తన ట్రైనర్ పైన ఉన్న నమ్మకంతోనే అంతలా కష్టపడి మరి నేర్చుకున్నాడట.

ఆ తర్వాత కరాటే లో కొన్ని టెక్నిక్స్ కోసం జపాన్ లో కూడా కొన్నాళ్ల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు.

పవన్ ఇక ఇటీవల హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu ) సినిమా కోసం కూడా కాస్త ట్రైన్ అవుతున్నాడు.

పవన్ ఫ్యాన్స్ లేకపోతే చిరు సినిమాలు ఆడవు.. గ్రంథి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్!