ఆ రైటర్లు నాగార్జున కోసమే రాసుకున్న కథను లాగేసుకున్న స్టార్ హీరో ఎవరంటే..?
TeluguStop.com
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ కథలను రాసుకునేవారు కాదు.కేవలం డైరెక్షన్ మాత్రమే చేస్తూ కథలు రాసే పనిని రైటర్లకి అప్పగించేవారు.
ఇక అలాంటి రైటర్లలో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్లలో పరుచూరి బ్రదర్స్( Paruchuri Brothers ) ఒకరు.
వీళ్ళు చేసిన ప్రతి సినిమా కూడా అప్పట్లో మంచి విజయాలను అందుకునేవి.ఇక ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరితో వీళ్ళు సినిమాలు చేయడం విశేషం.
ఇక వీళ్ళు చేసిన ప్రతి సినిమా కూడా ఆయా హీరోల కెరియర్లలో ది బెస్ట్ సినిమాలు గా నిలిచిపోయేవి.
"""/" /
ఇక వీళ్ళు నాగార్జున( Nagarjuna ) కోసం ఒక లవ్ అండ్ యాక్షన్ సినిమా కథను కూడా రాసుకున్నారట.
అయితే ఈ కథ ను నాగార్జున చేస్తేనే బాగుంటుంది అని వాళ్ళు భావించినప్పటికీ, మధ్యలో రామానాయుడు( Ramanaidu ) పరుచూరి వాళ్ళను పిలిపించి ఆ కథ విని అది మన వెంకటేష్ తో( Venkatesh ) చేయండని చెప్పి ఆ కథను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకి రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించడం విశేషం.అయితే ఆ సినిమానే వెంకటేష్ హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వం లో వచ్చిన కూలి నెంబర్ వన్( Coolie No.
1 ) సినిమా కావడం విశేషం.ఇక ఈ సినిమా వెంకటేష్ కేరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది.
ఇక ఈ సినిమాతో వెంకటేష్ మంచి సక్సెస్ ని అందుకున్నాడు. """/" /
అయితే పరుచూరి వాళ్లు నాగార్జునను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా స్టోరీ రాసినప్పటికీ ఆయనకి ఈ కథను వినిపించలేదట.
మధ్యలో రామానాయుడు వచ్చి ఆ కథను వెంకటేష్ కోసం బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ విషయాన్ని పరుచూరి వాళ్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం.ఇక ఇది ఇక ఉంటే ప్రస్తుతానికి పరుచూరి వాళ్లు సినిమాలు ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటున్నారు.
త్వరపడండి.. భారతీయ పోస్టల్ లో 21,413 భర్తీకి నోటిఫికేషన్ విడుదల