పెట్రోల్, డీజిల్ కార్లను ఎలక్ట్రిక్ కార్లగా మార్చాలంటే ఎంత ఖర్చు అవుతుందంటే..?

ప్రస్తుతం మార్కెట్లో డీజిల్, పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్న సంగతి తెలిసిందే.అయితే కొంతమంది వాహనదారులు తమ పెట్రోల్, డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలు( Electric Vehicles )గా మార్చుకోవాలి అనుకుంటున్నారు.

సాధారణ జిప్సీలో ఈ రకమైన సవరణకు దాదాపుగా రూ.6 లక్షల వరకు ఖర్చు అవుతుంది.

మధ్యతరగతి వినియోగదారులకు ఇవి కాస్త భారంగానే ఉంటుంది.ఇందుకోసం ఓ పాలసీని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి( Delhi State ) తెలిపారు.

"""/" / కొత్త పాలసీకి సంబంధించిన పనులు సాగుతున్నాయని.ప్రస్తుత పాలసీని ఆరు నెలలు లేదా కొత్తపాలసికి సిద్ధమయ్యే వరకు పొడిగిస్తామని మంత్రి తెలిపారు.

క్యాబినెట్ నోట్ తీసుకు వస్తున్నామని, ఒక వారంలో అది ఖరారు అవుతుందని తెలిపారు.

"""/" / పెట్రోల్ లేదా డీజిల్ కార్లను ఎలక్ట్రిక్ కారులుగా మార్చే ప్రక్రియను రెట్రో ఫిట్టింగ్( Retro Fitting ) అంటారు.

పెట్రోల్ లేదా డీజిల్ కారులో ఉండే ఇంజన్ తొలగించి, దాని స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్ తో పాటు బ్యాటరీని అమరుస్తారు.

వీటితో పాటు కారులో పవర్ సిస్టం, బ్రేకింగ్ సిస్టం, చార్జింగ్ సిస్టం లాంటి ఇతర అవసరమైన మార్పులు కూడా చేస్తారు.

కారు వెలుపలి భాగంలో కూడా కొన్ని ప్రత్యేకమైన మార్పులు చేస్తారు.పెట్రోల్ లేదా డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చడానికి అయ్యే ఖర్చు, కారు పరిస్థితి తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ధర, ఇన్స్టాలేషన్ ఖర్చు పై ఆధారపడి ఉంటుంది.

సాధారణంగా దీని మొత్తం ఖరీదు రూ.2 లక్షల నుంచి రూ.

6 లక్షల మధ్య ఉంటుంది.ప్రస్తుతం అనేక కంపెనీలు ఈ ఈవీ రెట్రో ఫిట్టింగ్ చేస్తున్నాయి.

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది.

అప్పట్లోనే ఆదిపురుష్ లాంటి డిజాస్టర్.. రాముడి క్యారెక్టర్‌లో ప్రభాసే నయం..?