వేసవిలో రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా?.. నిపుణుల సలహా ఇదే..
TeluguStop.com
వేసవి కాలం మంటలు పట్టిస్తోంది.ఈ సీజన్‌లో చెమటలు పట్టడం అనేది సాధారణం.
ముఖ్యంగా నుదిటి నుండి చెమలు కారిపోతుంటాయి.దీనిని దృష్టిలో ఉంచుకుని వీలైనంత వరకూ ఎవరూకూడా పనిలేకుండా ఎండలో బయటకు వెళ్లకూడదు.
వేసవిలో డీహైడ్రేషన్ ముప్పు మరింతగా పెరుగుతుంది.డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి కొరత ఏర్పడటం.
దీని నివారణకే వేసవిలో నీరు ఎక్కువగా తాగాలని, అదేవిధంగా పండ్లు, జ్యూస్‌లు, ఇతర పానీయాలు మొదలైనవి తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.
ఒక వ్యక్తి ప్రతిరోజూ కనీసంగానైనా 2 నుండి 3 లీటర్ల నీరు తప్పక తాగాలి.
అయితే వేడి ఎక్కువగా ఉన్న సందర్భాల్లో శరీరానికి చెమటలు పట్టి నీటి కొరత తలెత్తుతుంది.
ఇటువంటి సందర్భంలో 3 నుండి 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి.సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ ప్రవీణ్ సింగ్ తెలిపిన వివరాలను అనుసరించి ఒక్కసారిగా నీరు తాగడానికి బదులుగా సిప్ బై సిప్ తాగడం ఉత్తమం.
"""/"/
ఇది జీర్ణ శక్తిని మరింతగా మెరుగుపరుస్తుంది.గతంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం నీరు మనకు ఎంతో ముఖ్యమైనది.
మనం కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి.ఇలా చేయడం వల్ల మన శరీరం హైడ్రేట్‌గా మారుతుంది.
అనారోగ్యం వాటిల్లదు.శరీరంలో నీటి కొరత లేనప్పుడు మీరు అనారోగ్యం బారిన పడరు.
రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగేవారిలో హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని డాక్టర్ సింగ్ తెలిపారు.
మన శరీరానికి 65 శాతం నీరు అవసరమని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
చలికాలంలో పెరుగు మంచిది కాదని దూరం పెడుతున్నారా.. అయితే చాలా నష్టపోతున్నారు!