రూపాయి నాణెం తయారీకి ఖర్చుతో కలిపి నాణెం విలువ ఎంతో తెలుసా..?

భారత ప్రభుత్వం( Govt.Of India ) నాణేల ముద్రణలో వాటి విలువ కంటే ఎక్కువ ఖర్చు చేస్తోంది.

భారత దేశ ప్రభుత్వం కరెన్సీ నోట్లతో పాటు 1, 2, 5, 10, 20 నాణేలను ముద్రిస్తున్న సంగతి తెలిసిందే.

ఒక రూపాయి నాణేల( 1 Rupee Coin ) తయారీ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.

ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం.స్వాతంత్ర భారత దేశంలో మొదటిసారిగా 1950లో ఒక రూపాయి నాణెం ముద్రించబడింది.

ఒక రూపాయి నాణెం విలువ 100 పైసలతో సమానం.భారతదేశంలో చలామణిలో ఉన్న అతి చిన్న భారతీయ నాణెం గా ఒక్క రూపాయి నాణెం అని చెప్పవచ్చు.

"""/" / అయితే 1992 తర్వాత రూపాయి నాణేలను స్టైన్ లెస్ స్టీల్ తో ( Stainless Steel ) తయారు చేస్తున్నారు.

గుండ్రంగా ఉండే ఈ ఒక్క రూపాయి నాణెం బరువు 3.76 గ్రాములు.

రూపాయి నాణెం వ్యాసం 21.93 మిల్లీమీటర్లు, నాణెం మందం 1.

45 మిల్లీమీటర్లు.భారతదేశంలో ఉండే కరెన్సీలో కొన్ని నోట్లను భారత ప్రభుత్వం ముద్రించగా, మరికొన్ని నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ముద్రిస్తుంది.

ఇందులో రూ.2 నుంచి రూ.

2000 నోట్ల వరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ముద్రిస్తుంది.ప్రస్తుతం ఆర్బీఐ రూ.

2000 నోటును వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.భారత ప్రభుత్వ విషయానికి వస్తే ఒక రూపాయి నోటుతో పాటు అన్ని నాణేలను ముద్రిస్తుంది.

"""/" / 2018 వ సంవత్సరం ఆర్బీఐ ( RBI ) అందించిన సమాచారం ప్రకారం ఒక్క రూపాయి నాణెం తయారీకి రూ.

1.11 ఖర్చు అవుతుంది.

రూ.2 నాణెం తయారీకి రూ.

1.28, రూ.

5 నాణెం తయారీకి రూ.3.

69, రూ.10 నాణెం తయారీకి రూ.

5.54 ఖర్చు అవుతుంది.

ఇక కరెన్సీ నోట్ల విషయానికి వస్తే రూ.2000 నోటు ప్రింట్ చేయడానికి రూ.

4 ఖర్చు అవుతుంది.పది రూపాయల 1000 నోట్ల తయారీకి 960, వంద రూపాయల 1000 నోట్ల తయారీకి 1770, 200 రూపాయల 1000 నోట్ల తయారీకి 2370, 500 రూపాయల 1000 నోట్ల తయారీకి 2290 ఖర్చు ఉంటుందని ఒక అంచనా.

అయితే ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం ఈ లెక్క పైసల రూపంలో కాస్త పెరిగి ఉంటుందని సమాచారం.

ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై ఏపీ డీజీపీ స్పందన..!!