రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనక‌పోతే ఇన్ని న‌ష్టాలా..?

సెక్స్‌ ఇదో గొప్ప కార్యం.మాన‌వుడు కానీ ఇత‌ర జంతువులు అంత‌రించిపోకుండా ఉన్నాయంటే దానిని ఈ సెక్సే కార‌ణం.

మాన‌వుడు త‌న సంత‌తిని పెంచుకుంటూ పోవ‌డంలో అతి ముఖ్య‌మైన పాత్ర పోషించేంది సెక్స్‌.

కానీ దీని పేరు చెబితే చాలా మంది చీద‌రించుకుంటారు.ఇదో ర‌హ‌స్య కార్యంలో భావిస్తారు.

న‌లుగురిలో దీని గురించి మాట్లాడ‌టానికి సంకోచిస్తారు.మ‌న ఇండియా వంటి దేశాల్లో ఇది చాలా ఎక్కువ‌.

దీనికి కార‌ణాలు లేక‌పోలేదు.భార‌తదేశంలో ఎక్కువ‌గా ఉమ్మ‌డి కుటుంబాలు ఉంటాయి.

ఇంట్లో ఉన్న వాళ్లంద‌రూ సంప్ర‌దాయబ‌ద్దంగా, ప‌ద్ద‌తిగా పెరుగుతారు.అందుకే సెక్స్ వంటి విష‌యాలు బ‌హిరంగంగా మాట్లాడారు.

ఇలాంటి విష‌యాలు మాట్లాడితే పిల్ల‌లు చెడిపోతార‌ని భావిస్తారు.ఇందులోనూ కొంత నిజం లేక‌పోలేదు.

అయితే స్కూల్‌లో కాలేజీ సిల‌బ‌స్‌లో కూడా దీని గురించి పెద్దగా నేర్ప‌క‌పోవ‌డంతో సెక్స్ ఎడ్యుకేష‌న్ గురించి ఎక్కువ మందికి అవ‌గాహ‌న లేదు.

భార్యా, భ‌ర్త‌ల మ‌ధ్య అనురాగానికి, అనుబంధానికి సెక్స్ ఒక ముఖ్య కార‌ణం.వారి దాంప‌త్య జీవితం కల‌కాలం సంతోషంగా సాగాలంటే వారి మ‌ధ్య సెక్స్ త‌ర‌చూ జ‌రుగుతుండాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

"""/"/ సెక్స్ కేవ‌లం ఆనందం కోస‌మే కాదు ఆరోగ్యం కోసం కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెబుతున్నారు.

రెగ్యుల‌ర్‌గా సెక్స్‌లో పాల్గొనే వారిలో వ‌య‌సు త‌క్కువ‌గా క‌నిపిస్తుంద‌ని చెబుతున్నారు.చాలా మంది ఈ మ‌ధ్య వివిధ కార‌ణాల‌తో సెక్స్‌లో పాల్గొన‌ట్లేద‌ని తెలుస్తోంది.

త‌ర‌చూ సెక్స్‌లో పాల్గొంటే శ‌రీరం పాడైపోతుంద‌న్న దాంట్లో ఎలాంటి నిజం లేద‌ని తెలుపుతున్నారు.

సెక్స్‌లో పాల్గొన్న వెంట‌నే శ‌రీరం వ్యాయామం చేసిన‌ట్టు అల‌సిపోయి త్వ‌ర‌గా నిద్ర ప‌డుతుంద‌ని చెబుతున్నారు.

దీంతో రోజు మొత్తం ఉత్సాహంగా గ‌డుపుతార‌ని తెలుపుతున్నారు.సో దంప‌తుల‌కు ఎన్ని టెన్‌ష‌న్స్ ఉన్నా.

సెక్స్‌లో పాల్గొన‌డానికి స‌మ‌యాన్ని కేటాయించుకోవాల్సిన అవ‌ప‌స‌రం ఎంతైనా ఉంద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Junior NTR: పది సెకన్ల సీన్ లో ఆరు ఎమోషన్లు.. తారక్ గొప్ప నటుడని చెప్పడానికి ప్రూఫ్ ఇదే!