అమలాపురం మంటలు : అంతమందినీ అరెస్ట్ చేస్తారా ?
TeluguStop.com
కోనసీమ జిల్లాలను అంబేద్కర్ కోనసీమ జిల్లా గా మార్చడం తో మొదలైన వివాదం అమలాపురం లో మంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసాల దహనం తో పాటు, మూడు ప్రభుత్వ ,ప్రైవేటు బస్సుల దహనం వరకు ఈ వ్యవహారం వెళ్ళింది.
అప్పుడు రాజుకున్న ఈ పేరు మార్పు మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి.దీనికి తగ్గట్లుగా రాజకీయ పార్టీలు దీనికి కారణం మీరు అంటే మీరు అని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తమ రాజకీయాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇక ఈ ఆందోళనను మరింత ఉధృతం చెందకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఈ ఘటన చోటు చేసుకున్న దగ్గర నుంచి అమలాపురం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
ఇక మరిన్ని అల్లర్లు జరిగే అవకాశం ఉందని ముందస్తు సమాచారంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు.
ఇది ఇలా ఉంటే ఈ ఘటనకు కారకుడిగా అన్యం సాయి అనే వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
ఇతడు వైసీపీకి చెందిన వ్యక్తిగా జనసేన టిడిపి ఆరోపిస్తూ ఉండగా, ఇతడు జనసేన వ్యక్తి అని వైసిపి ఆధారాలను బయటపెడుతోంది.
ఇతడు విషయంలో ఇంకా స్పష్టత లేదు.ఇదిలా ఉంటే ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా ప్రాథమికంగా 200 మందిని గుర్తించారు.
ఇంకా 800 మందికి ఇందులో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు .వీరందరి వివరాలను సేకరించి వారి పైన కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
"""/"/
వీరి పై సోషల్ యాక్టివిటీస్ పేరిట నమోదయ్యే సెక్షను నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటి వరకు నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి .ఏలూరు రేంజ్ డిఐజి ఈ కేసును విచారిస్తు ఉండడం తో త్వరలోనే దీనికి సంబంధించి పెద్దఎత్తున అరెస్టులు చోటు చేసుకోబోతున్నాయి .
అలాగే ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా పోస్టులను పెడుతున్న వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
వింటర్ లో హెయిర్ ఫాల్ మరింత ఎక్కువైందా.. ఇలా చెక్ పెట్టండి!