వావ్.. రాగుల వల్ల మనకి ఇన్ని ఉపయోగాలా..?!

రాగులు అంటే మనలో చాలామందికి తెలుసు.ప్రస్తుతం మండుతున్న ఎండలకు ఈ రాగులతో ఎంతో ఉపయోగాలు ఉన్నాయి.

ఆందోళన, నిద్రలేమి, డిప్రెషన్ తో బాధపడేవారికి ఈ రాగులు ఔషధంగా ఉపయోగపడతాయి.

రాగులు దక్షిణ భారతదేశంతో పాటు ఆఫ్రికన్ దేశాల ప్రజలు విస్తృతంగా ఉపయోగించే తృణ ధాన్యము.

ప్రస్తుతం మనలో కూడా చాలామంది ఈ రాగులు ఉపయోగిస్తున్నాము.రాగులలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.

ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.డయాబెటిస్ తో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అధిక బరువుతో ఉన్నవారు ఈ రాగులతో చేసే ఆహారం నిత్యం ఉపయోగిస్తే బరువు తగ్గే అవకాశం చాలా ఉంటుంది.

చిన్న పిల్లలకు రాగి జావా మంచి బలమైన ఆహారంగా ఉపయోగపడుతుంది.రాగుల వాడకం వల్ల ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

శరీరానికి అధిక కాల్షియం ఐరన్ అందించడం ద్వారా ఎముకలు గట్టిపడతాయి.ప్రస్తుత వేసవి కాలంలో ఈ రాగులతో పిండి చేసి దానిని జావ రూపంలో సేవించడం వల్ల శరీరంలోని వేడి చాలా వరకు తగ్గుతుంది.

ఒక్క గ్లాసు నీళ్లను తీసుకొని ఆ నీళ్లను ఒక గిన్నెలో పోసి బాగా మరిగించి అందులో రాగి పిండిని రెండు స్పూన్లు వేసి కలిపి బాగా ఉడికించి.

, అందులో చిటికెడు ఉప్పు వేసి రెండు గ్లాసులు మజ్జిగ కలిపి త్రాగడం వల్ల శరీరంలోని వేడి చాలావరకూ తగ్గుతుంది.

ఉదయం తాగే టీ, కాఫీల బదులు ఈ రాగి జావ ప్రతిరోజు వేసవిలో తాగడం వల్ల ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది.

చంద్రబాబు పేరున ఒక డ్రీమ్ లేదు.. స్కీమ్ లేదు..: మంత్రి బొత్స