వివాహాలు ఎన్ని రకాలు ఏ వివాహం దేనికి సంకేతం అంటే..?
TeluguStop.com
వివాహం( Marriage ) అనేది మనవ జీవితంలో ప్రత్యేకమైన వేడుకాని ఖచ్చితంగా చెప్పవచ్చు.
అంతటి ప్రత్యేకమైన శుభకార్యాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.జీవితాంతం కలిసి నివసించడానికి తమ హక్కులను అంగీకరిస్తూ మతపరమైన ఆచరణ గుర్తింపు పొందిన స్త్రీ, పురుషుల సంయోగమే వివాహం అని పండితులు చెబుతున్నారు.
అయితే యాజ్ఞవల్క్యస్మృతి నీ అనుసరించి పూర్వికులు 8 విధాలైన వివాహాలను శాస్త్ర సమ్మతమన్నారు.
ఈ వివాహాల వల్ల వధూవరులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.ఆ శాస్త్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
ముఖ్యంగా చెప్పాలంటే తల్లిదండ్రులు శక్తి కొలది వస్త్ర భూషణాదులతో తమ కూతురుని అలంకరించి సమర్ధుడైన వరుడి( Groom ) చేతితో కూతురు చేతిని కలుపుతారు.
దీనిని బ్రహ్మ వివాహం( Brahma Vivah ) అని అంటారు.యజమాని తన గృహంలో దైవయజ్ఞం చేసి, ఆ యజ్ఞాంతంలో తన పుత్రికను ఋత్విజునికి ధారాపూర్వకంగా దానం చేయ్యాడన్ని దైవం అంటారు.
అలాగే వధూవరులు ఒకచోట సుఖంగా ఉంటూ ధర్మాచరణం చేస్తారనే బుద్ధితో వరునికి కన్యాదానం( Kanyadanam ) చెయ్యడన్ని ప్రాజాపత్యం అంటారు.
ఈ సాంప్రదాయంలో కన్యాశుల్కం ఉండదు.అలాగే కన్య తల్లిదండ్రులకు ఒక ఆవును ఇచ్చి కన్యాదానాన్ని గ్రహించడన్ని అర్షం అంటారు.
"""/" /
వరునీ నుంచి కన్య తల్లిదండ్రులు( Bride Parents ) అధిక దానాన్ని తీసుకొని కన్య ను ఇచ్చి వివాహం చేయడానికి అసుర వివాహం అని అంటారు.
కన్యకు గాని, వారి కుటుంబ సభ్యులకు గానీ ఇష్టం లేకుండా బలవంతంగా వివాహం చేసుకోవడాన్ని పై శాచము అని కూడా అంటారు.
వధూవరులకు ఇష్టం ఉండి పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించినప్పుడు వివాహం చేసుకోడాన్ని రాక్షసము అని అంటారు.
స్వయంవరం( Swayamvaram ) అనే ఒక సంప్రదాయం స్త్రీ స్వతంత్రానికి ప్రతికగా ఉన్నట్లు పురాణాలలో కనిపిస్తుంది.
శివధనస్సును విరిచి శ్రీ రాముడు సీతను, మత్స్యయంత్రం ఛేదించి అర్జునుడు ద్రౌపదిని పెళ్ళాడారు.