TDP, BJP: ఎన్డీయే లోకి టీడీపీ.. బీజేపీ కి ఎన్ని సీట్లు ఇస్తున్నారంటే ?
TeluguStop.com
గత రెండు రోజులుగా టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) ఢిల్లీలోనే మకాం వేసి మరీ బిజెపి కీలక నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోను , బిజెపి జాతియ అధ్యక్షుడు జేపీ నడ్డా తోను పొత్తుల అంశంపై చర్చలు జరిపారు.
ఈ పొత్తుల చర్చలు ఫలించడంతో టిడిపి, జనసేన, బిజెపి ( TDP, Jana Sena, BJP )మధ్య పొత్తు ఇక కుదిరినట్లే .
లాంఛనంగా ఎన్డీఏలోకి టిడిపి చేరబోతోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు అమిత్ షా తో చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు .
దాదాపు గంట పాటు ఈ పొత్తుల అంశంపై చర్చలు జరిపారు.బిజెపికి టిడిపి అధినేత చంద్రబాబు ఇవ్వాలనుకుంటున్న సీట్లు తదితర అంశాలపై చంద్రబాబు పవన్ లతో అమిత్ షా చర్చించారు.
అలాగే బిజెపి కోరుకుంటున్న సీట్ల వివరాలను ఆ పార్టీ అధినాయకత్వం చంద్రబాబు పవన్ ల ముందు ఉంచిందట.
ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటుపై చర్చించి ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం .
"""/" /
పొత్తులో భాగంగా 6 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు అంగీకారం తెలిపారట.
అసెంబ్లీ సీట్ల విషయంలో అమిత్ షా ( Amit Shah )తో జరిగిన చర్చల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదట.
దీనిపై రాష్ట్ర స్థాయి నాయకులతో చర్చించాలని బిజెపి నిర్ణయించుకుందట.రాష్ట్ర బిజెపి ఏపీ అధ్యక్షురాలతో మాట్లాడాలని అమిత్ షా సూచించినట్లు సమాచారం.
మరికొద్ది సేపట్లో టిడిపి, జనసేన , బిజెపి ఉమ్మడి ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నాయి, .
టిడిపి, బిజెపి మధ్య పొత్తు ఖాయం కావడంతో ఈనెల 14న జరగబోయే సమావేశానికి టిడిపిని సైతం ఆహ్వానించారట.
అయితే టిడిపి జనసేన బిజెపి మధ్య పొత్తు ఖాయమైన నేపథ్యంలో సీట్ల పంపకాలు ఏ విధంగా చేపడుతారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది .
"""/" /
బిజెపికి 6 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టిడిపి అంగీకారం తెలిపింది.
అయితే ఆ ఆరు నియోజకవర్గాలు ఏమిటి అనేది ఎక్కడా బయటకు రాకుండా చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు .
ఇప్పటికే జనసేనకు పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ , మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు .
మిగిలిన స్థానాల్లో టిడిపి , బిజెపి సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.
నారా బ్రాహ్మణికి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందా… అందుకే వద్దనుకున్నారా?