నవగ్రహాలకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఎప్పుడు చేయాలి?
TeluguStop.com
మనకు ఏవైనా ఇబ్బందులు ఉన్నా, సమస్యలు వచ్చినా మనం వెంటనే వేద పండితుల దగ్గరకు వెళ్తాం.
సమస్య ఏంటో తెలుసుకొని ఆ పీడలను వదిలించుకునేందుకు నవ గ్రహాల పూజ చేస్తాం.
అంతే కాకుండా వారంలో ఏదో ఒక రోజు లేదా వేద పండితులు సూచించిన కొన్ని రోజుల పాటు ప్రదక్షిణలు చేసి మన పీడలను వదిలించుకుంటాం.
అయితే నవగ్రహ మంటపానికి ప్రతిరోజూ ప్రదక్షిణలు చేయొచ్చా లేదా, చేస్తే ఎన్ని ప్రదక్షిణలు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు తెల్సినంత వరకు నవ గ్రహాలు ఎక్కువగా శివ ఆలయాల్లో కనిపిస్తాయి.
అయితే దోష నివృత్తి కోసం చేసే ప్రదక్షిణలు దాని విధానం గురించి ప్రత్యేకంగా తెలుసుకొని చేయాలి.
మామూలుగా అయితే ఆలయంలో ఉన్న దేవతలు అందరికీ అంటే నవ గ్రహాలను కూడా కలుపుకొని ప్రదక్షిణం చేయాలి.
అయితే నవ గ్రహాలకు మూడు సార్లు ప్రదక్షిణలు చేయొచ్చు.తొమ్మిది గ్రహాలు కనుక తొమ్మిది సార్లు చేయవచ్చు.
లేదా పదకొండు, 21 సార్లు, 27 సార్లు ఇలా బేసి సంఖ్య వచ్చేలా చేయడం సంప్రదాయం.
ఇలా మనకు వీలువున్నన్ని రోజులు లేదా వేద పండితులు సూచించినన్ని రోజులు ప్రదక్షిణలు చేసి మన పాపాలను, పీడలను, గ్రహ దోషాలను తొలగించుకోవాలి.
అలా చేయడం వల్ల మన కష్టాలు, సమస్యలు తొలగి హాయిగా, సంతోషంగా జీవిస్తాం.
అందుకే నవ గ్రహాలకు మనం ఎక్కువ ప్రాముఖ్యతను కల్గిస్తాం.దాని వల్లే నవ గ్రహాల పూజలు, ప్రదక్షిణలకు మరింత ప్రాధాన్యతను ఇస్తాం.