వామ్మో.. ఈ కేటుగాడు ఏకంగా డీఎస్పీనంటూ ఎంత మందిని మోసం చేశాడంటే..!
TeluguStop.com
నేటి రోజుల్లో అమాయక ప్రజలను మోసాలు చేసే వారిని తరుచూ చాలా మందిని చూస్తుంటాం.
ఏసీబీ అధికారులమని, ఆదాయపు పన్ను శాఖ అధికారులమని, పోలీసు అధికారులమని చెప్పుకుంటూ తిరుగుతూ.
జనాలను బురిడీ కొట్టించే కేటుగాళ్ల భరతం పోలీసులు పడుతుంటారు.కానీ ఒక చోట ఓ కేటుగాడు ఏకంగా పోలీసునంటూ 20 మంది నిరుద్యోగుల నుంచి ఏకంగా కోటి రూపాయల పైనే వసూలు చేశాడు.
కామా రెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనను విన్న పోలీసులు విస్తుపోయారు.అసలేం జరిగిందంటే.
కామారెడ్డి జిల్లాలో స్వామి అనే వ్యక్తి తాను డీఎస్పీ నని జనాలను నమ్మించాడు.
బిబి పేట మండలం తుజల్ పూర్ గ్రామానికి చెందిన స్వామి వ్యక్తి ఏకంగా డీఎస్పీ డ్రెస్ వేసుకుని బండిలో తిరుగుతూ మోసాలు చేస్తున్నాడు.
ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ నకిలీ డీఎస్పీ కన్ను నిరుద్యోగుల మీద పడింది.
తెలంగాణ రాష్ర్టంలోని దాదాపు 5 జిల్లాల్లో 20 మంది వరకు నిరుద్యోగులు ఈ కేటుగాడి వలలో పడిపోయారు.
దాదాపు కోటి రూపాయల నగదును అతగాడికి అప్పజెప్పారు.తీరా తాము మోసపోయామని గ్రహించే సరికి స్వామి ఆచూకీ కానరాకుండా పోయింది.
దీంతో వీరు లబోదిబోమంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆశ్రయించి.తమ గోడు వెళ్లబోసుకున్నారు.
"""/"/ విషయం తెలుసుకున్న పబ్లిక్ కమిషన్ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్వామి బండారం మొత్తం బయట పడింది.
డీఎస్పీగా చెప్పుకు తిరుగుతున్న స్వామిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.మరో విషయమేంటంటే స్వామి డీఎస్పీనని చెప్పి పలువురు ఇసుక ట్రాక్టర్ల ఓనర్ల వద్ద కూడా డబ్బులు వసూలు చేయడం గమనార్హం.
ఇంటర్ కూడా పాస్ కాని స్వామి డీఎస్పీనని చెప్పుకు తిరుగుతూ.డిగ్రీలు, పీజీలు చదివిన వారిని మాయమాటలతో బురిడీలు కొట్టించడం వింతగా ఉంది కదూ.
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది…