అర్జునుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి? అవెలా వచ్చాయి?

P Style="text-align: Left"ద్రుడి అంశతో కుంతీకి పుట్టిన వాడే అర్జనుడు.ఈయన పాండవుల్లో మధ్య వాడు.

అయితే ఈ పాండురాజు కుమారుడైన అర్జునుడికి మొత్తం పది పేర్లు ఉన్నాయి.పిలిచేందుకు ఒక్క పేరుంటే చాలు ఇన్ని ఎందుకు, ఎలా వచ్చాయో అని ఆశ్చర్యపోతున్నారు.

ఆయన సాధించిన ఘనతల కారణంగా అన్ని పేర్లు వచ్చాయి.ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

పాండవులు కర్ణుడు తెల్లగా ఉండటం.ఆయన చేసే మంచి పనుల వల్ల అతనికి అర్డునుడు అనే పేరు పెట్టారట.

అంతే కాదు అర్జున అంటే తెల్లని రంగు అని కూడా అర్థం ఉంది.

అర్జునుడు పూర్వ ఫల్గున, ఉత్తర ఫల్గున నక్షత్రాల సంధి కాలంలో పుట్టినందున ఫల్గునుడయ్యాడు.

అలాగే కుంతీ దేవికి పృథ అనే పేరు ఉంది.ఆమె కుమారుల్లో చివరి వాడైన అర్జునుడికి ఆమే పేరు మీదుగా పార్థుడు అనే పేరు వచ్చింది.

అర్జునుడి పరాక్రమానికి మొచ్చి ఇంద్రుడు ఎప్పుడూ ప్రకాశించే కరీటాన్ని బహుకరించాడు.అలా అర్జునుడిని కరీటి అని కూడా పిలుస్తారు.

అంతే కాకుండా ఆయన రథానికి ఎప్పుడూ తెల్ల గుర్రాలని మాత్రమే వాడటం వల్ల శ్వేత వాహనుడు అని కూడా అంటారు.

/p యుద్ధ రంగంలో అర్జునుడి బీభత్సం సృష్టించడం వల్ల ఆయనను బీభత్సుడు అని కూడా పిలుస్తారు.

ఎంతటి బలవంతులనైనా అర్జునుడు ఓడించడం వల్ల అతడికి విజయుడు అనే పేరు వచ్చింది.

అలాగే ధర్మరాజుకు గాయం కల్గించిన వారిని హత మార్చడం వల్ల జిష్ణుడు అనే పేరుతో కూడా పిలుస్తుంటారు.

అలాగే అర్జునుడికి ఎడమ చేతి వాటం తీవ్రంగా ఉండటం వలల్ సవ్యసాచి అని అంటారు.

భూ మండలం మొత్తాన్ని జయించి.ఓడిన రాజుల నుంచి అపారమైన ధనం పొందడం వల్ల ధనంజయుడయ్యారు.

ఇలా అర్జునుడికి మొత్తం పది పేర్లు వచ్చాయి.ఇందులో ఎక్కువగా ఫల్గునుడు, పార్థుడు, కిరీటి, సవ్యసాచి, ధనుంజయ పేర్లు మాత్రమే ఎక్కువ ప్రసిద్ధి చెందాయి.

ఇంకోసారి అలా చేస్తే అస్సలు ఊరుకోను… వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సాయి పల్లవి!