ఒకే ఏడాదిలో మొత్తం 18 సినిమాలు విడుదల చేసిన హీరో ..ఇలా ఎంతమంది హీరోలు ఉన్నారు
TeluguStop.com
ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా సినిమాలు తీయాలంటే ఒక్కో మూవీ కనీసం ఏడాది నుంచి రెండేళ్ల సమయం తీసుకుంటుంది.
బాహుబలి సినిమాకు ఏకంగా నాలుగేండ్ల సమయం పట్టింది.గ్రాఫిక్స్, యానిమేషన్స్ అంటూ నెలల కొద్ది సమయం ముందుకు గడుస్తోంది.
కానీ ఏ టెక్నాలజీ లేని రోజుల్లోనే సినిమా అత్యంత వేగంగా రూపొందేవి.కేవలం రెండు మూడు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేసే వాళ్లు.
నటులంతా రాత్రి, పగలు అని తేడా లేకుండా కష్టపడి నటించే వారు.ఒక్కో ఏడాదిలో పలువురు హీరోలు పదుల సంఖ్యలో సినిమాల్లో నటించే వాళ్లు.
తెలుగు సినీ పరిశ్రలో ఒకే ఏడాది 10 సినిమాలకు పైగా నటించిన హీరోలు ఎంతో మంది ఉన్నారు.
ఆయా సినిమాల్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్‌లు ఉన్నాయి.ఒక్క ఏడాదిలో ఎక్కువ సినిమాల్లో నటించి రిలీజ్ చేసిన తెలుగు హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
"""/"/
తెలుగులో ఒక ఏడాది అత్యధిక సినిమాలు చేసిన హీరోల్లో సూపర్ స్టార్ దే పై చేయి.
1972 లో కృష్ణ హీరోగా ఏకంగా 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి.వాటిలో సగానికి పైగా చక్కటి విజయాన్ని నమోదు చేసుకున్నాయి.
"""/"/
కృష్ణ తర్వాత ఏడాదిలో అత్యధిక సినిమాల్లో నటించిన హీరో ఎన్టీఆర్.1964లో ఆయన 17 సినిమాలు చేశారు.
ఇందులో రెండు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి.కృష్ణం రాజు 1974లో 17 సినిమాలు చేశారు.
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ సైతం 1988లో 17 సినిమాల్లో నటించారు.1980లో చిరంజీవి నటించిన 14 సినిమాలు రిలీజయ్యాయి.
భారీ వసూళ్లతో ఇండస్ట్రీకి కొత్త ఊపును తెచ్చాయి. """/"/
శోభన్ బాబు 1980లో 12 సినిమాలు చేశారు.
వీటిలో సగానికి పైగా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి అక్కినేని నాగేశ్వర్‌రావు 1960, 1971, 1984లో సంవత్సానికి 9 చొప్పున 27 సినిమాలు చేశారు.
ఇందులో పలు సినిమాలు ఇండస్ట్రీ హిట్ సాధించాయి.శ్రీకాంత్ 1998 లో 9 సినిమాలు చేశాడు.
అల్లరి నరేష్ 2008 లో 8 సినిమాల్లో నటించాడు.బాలకృష్ణ 1987 లో 7 సినిమాల్లో నటించగ మూడు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి.
మీ దగ్గర కర్రీ స్మెల్ రాకూడదా.. ఈ ఎన్నారై మహిళ చిట్కాలు తెలుసుకోండి..!