సమంతకే బాధలంటున్న అభిమానులు.. రాబోయే రోజుల్లో ఆమె కష్టాలు తీరాలంటూ?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలో ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్నేళ్లపాటు కలిసి జీవించి ఊహించని విధంగా విడాకులు ( Divorce ) తీసుకుని విడిపోతూ ఉంటారు.
కొందరు పెళ్లయినా కొన్ని ఏళ్లకు విడిపోతే మరికొందరు కొంతకాలానికి విడాకులు తీసుకొని విడిపోతూ ఉంటారు.
ఇలా విడాకులు తీసుకుని విడిపోయిన తరువాత ఎవరి జీవితం వారిది అన్నట్టుగా గడిపేస్తూ ఉంటారు.
కొందరు విడాకులు తీసుకున్నప్పటికీ వారి పిల్లలు కోసం అలాగే ఇతర విషయాల కోసం మళ్లీ మళ్లీ కలుస్తూ ఉంటారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) కూడా హీరో నాగచైతన్యతో( Naga Chaitanya ) విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.
"""/" /
ఇక విడాకుల తర్వాత ఎవరి జీతం వారిది అన్నట్టుగా నాగచైతన్య సమంత ఎవరి కెరియర్ పరంగా వారు బిజీ బిజీగా ఉన్నారు.
మామూలుగా సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఆ విషయాన్ని మరిచిపోతూ ఉంటారు.
దానికి సమంత విషయంలో మాత్రం అలా జరగడం లేదు.వీరు విడిపోయి చాలా ఏళ్లు అవుతున్నా కూడా సోషల్ మీడియా పదేపదే ఆ చేదు జ్ఞాపకాలను సమంతకు గుర్తు చేస్తూనే ఉన్నాయి.
జరుగుతున్న ఘటనలు అలా ఉన్నాయి మరి.నాగచైతన్య ప్రేమలో పడ్డాడంటూ గతంలో పుకార్లు వచ్చాయి.
ఆ సమయంలో సమంతతో విడాకులు మళ్లీ తెరపైకి వచ్చాయి.ఇక హీరోయిన్ శోభితాతో( Sobhita ) అతడు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు.
"""/" /
ఆ తర్వాత వేణుస్వామి( Venu Swamy ) నోరు పారేసుకున్నాడు.
ఇలా ప్రతి సందర్భంలో ఆ ఎఫెక్ట్ సమంతపై పడింది.ఇది చాలదన్నట్టు తాజాగా రాజకీయ నాయకులు కూడా సమంత గురించి మాట్లాడ్డం మొదలు పెట్టారు.
ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఉండదేమో.సమంత, చైతన్య విడిపోయి మూడేళ్లు అవుతోంది.
ఇన్నేళ్లయినా వీళ్లి విడాకుల వ్యవహారం మినిమం గ్యాప్స్ లో ఇలా తెరపైకి వస్తూనే ఉంది.
జీవితంలో జరిగిన బాధాకరమైన ఘటన గుర్తొచ్చిన ప్రతిసారి ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటుంది.ఆ ఇబ్బందిని ఎప్పటికప్పుడు చవిచూస్తూనే ఉంది సమంత.
అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఏ విషయం వచ్చినా కూడా పదేపదే ఈ విషయం గురించి ప్రస్తావన చేస్తూ సమంతకు లేని బాధని తెస్తున్నారు.
త్వరలో నాగచైతన్య రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడు.అప్పుడు కూడా పెళ్లి అంశం బయటకు వచ్చి ఆ సమయంలో కూడా మళ్లీ సమంత బాధపడే విధంగా పోస్టులు చేస్తూ ఉంటారు.
ఇలా మొత్తంగా చూసుకుంటే సమంతకే బాధలు వస్తాయి అంటున్నారు అభిమానులు.మరి ముందు ముందు అయినా సమంతకు ఈ కష్టాలు తీరుతాయో లేదో చూడాలి మరి.
సంక్రాంతికి వస్తున్నాం మమ్మల్ని బావి నుంచి బయటపడేసింది.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!