కుంకుమ పువ్వును ఆహారంలో భాగం చేసుకుంటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..!

హిమాలయాలలో పండే అరుదైన, ఖరీదైన పంట కుంకుమ పూరేకులు అని దాదాపు చాలామందికి తెలుసు.

అక్కడి వాతావరణం లోనే కుంకుమ పువ్వులు ఎంతో బాగా పండుతాయి.అందుకే అక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు కుంకుమ పువ్వు ఎగమతి అవుతుంది.

దీన్ని ఆహారం లో భాగం చేసుకునే వారి సంఖ్య మన దేశంలో చాలా తక్కువ.

నిజానికి చెప్పాలంటే వీటిని కూడా ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

బంగారు వర్ణంలో కనిపించే కుంకుమ పువ్వు( Saffron ) ప్రపంచంలోనే ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.

"""/" / వీటిని పెంచడం చాలా కష్టమైన పని.అందుకే వీటి ధర కూడా ఎక్కువగా ఉంటుంది.

వీటిని పూర్తిగా చేతులతోనే పనులు చేసి కష్టపడి పెంచాలి.ఇలాంటి మిషనరీలు ఉపయోగించడానికి వీలు కాదు.

ఈ మొక్కను సాఫ్రాన్ క్రోకాస్ అని కూడా పిలుస్తారు.దీని రంగే దీనికి ఎంతో ప్రాముఖ్యతను తెస్తుంది.

కుంకుమపువ్వు మొక్కలలో సమ్మేళనాలు అధికంగా ఉంటాయి.ఇవి యాంటీ యాక్సిడెంట్లుగా పనిచేస్తాయి.

ఇవి శరీరంలోని కణాలను ఆక్సికరణ ఒత్తిడి నుంచి కాపాడుతాయి.మానసిక ఆరోగ్యానికి కుంకుమపువ్వు ఎంతో మేలు చేస్తుంది.

ఇది యాంటీ డిప్రెసింట్ గా పని చేస్తుంది. """/" / ఇది మానసిక ఒత్తిడి( Mental Stress )ని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

కొన్ని అధ్యయనంలో ప్రకారం మానసిక సమస్యలను పరిష్కరించేందుకు కుంకుమపువ్వు ఎంతో బాగా పనిచేస్తుంది.

దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు త్వరగా తగ్గుతాయి.

వీటిలో కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి.ఇవి ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను ఏర్పడేలా చేస్తాయి.

కొన్ని అధ్యయనాల ప్రకారం కుంకుమ పువ్వు జ్ఞాపకశక్తి పనితీరు మెరుగుపరడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలాగే ఇది శరీరంలో జీవక్రియ రేటు ను మెరుగుపరుస్తుంది.వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల నిద్రలేమి ( Insomnia )వంటి సమస్యలు దూరం అవుతాయి.

అలాగే చర్మ సౌందర్యానికి కూడా కుంకుమపువ్వు ఎంతగానో ఉపయోగపడుతుంది.వారానికి రెండు నుంచి మూడుసార్లు పాలలో కుంకుమ పూరేకులను వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి మృతి.. భయాందోళనలో తల్లిదండ్రులు