ఇంటికి ఉండాల్సిన ద్వారాల సంఖ్యపై ఉన్న మూడ నమ్మకాలపై క్లారిటీ.. అసలు విషయం ఇది

ఇల్లు వాస్తును బట్టి ఆ ఇంట్లో ఉండే వారి ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలు ఆధారపడి ఉంటాయి అంటూ వాస్తు పండితులు అంటూ ఉంటారు.

దేవుడిని నమ్మే వారు ఖచ్చితంగా వాస్తును నమ్మాల్సిందే అంటూ హిందూ ధర్మం చెబుతోంది.

వాస్తు అనేది ఉంది, గుడులకు ఎలా అయితే వాస్తు ఉంటుందో అలాగే ఇళ్లకు కూడా వాస్తును ఖచ్చితంగా పాటించాల్సిందే అంటూ పండితులు చెబుతున్నారు.

వాస్తు సరిగా లేని ఇళ్లలో ఉంటే తీవ్రమైన ఇబ్బందులు అన్ని రకాల చిరాకులు ఉంటాయని చెబుతున్నారు.

కొందరు ఆ విషయాన్ని ఎక్స్‌పీరియన్స్‌ కూడా చేసి, వారి అనుభవాలను చెబుతున్నారు.ఇక ఇళ్ల వాస్తు విషయంలో ప్రధమంగా చూడాల్సింది ఇంటికి ఉన్న ద్వారాలు.

అవును ఇల్లు వాస్తు ప్రముఖంగా ద్వారాలు మరియు కిటికీల సంఖ్య ఆధారపడి ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

సింగిల్‌ రూం ఇంటికి ఒక కిటికి ఒక ద్వారం ఉంటే సరి పోతుంది.

అది ఒకటి ఇది ఒకటి ఉంటే ఎలాంటి సమస్య లేదు.అదే పెద్ద ఇళ్లకు ద్వారాలు ఎన్ని ఉండాలి, కిటికీలు ఎన్ని ఉండాలనే విషయంపై పలువురు పలు రకాల పుకార్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

లెక్కకు మించిన ద్వారాలు ఇంటికి ఉంటే మంచిది కాదని కొందరు, 8 ద్వారాలకు మించి ఇంట్లో ఉంటే అరిష్టం అంటూ మరి కొందరు పుకార్లు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

కాని అవి పుకార్లు మాత్రమే. """/"/ ఒక ఇంటికి గరిష్టంగా 32 ద్వారాలను పెట్టుకోవచ్చు అంటూ వాస్తు పండితులు చెబుతున్నారు.

అయితే ఆ ద్వారాల సంఖ్య ఖచ్చితంగా సరి సంఖ్య అయి ఉండాలని మాత్రం చెబుతున్నారు.

1 అనేది బేసి అయినా కూడా ఆ ఒక్క విషయంలో తప్ప ఇతర సంఖ్య విషయంలో మంచిది కాదని అంటున్నారు.

అంటే ద్వారాలు 1, 2, 4, 6, 8, 10.32 లా ఉండవచ్చు.

3, 5, 7, 9.వంటి సంఖ్యలతో ద్వారాలు అస్సలు ఉండవద్దు.

బేసి సంఖ్యలో ద్వారాలు ఉన్నట్లయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మరియు అనారోగ్య పరిస్థితుల్లో గందరగోళం ఉంటుంది.

ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య తలెత్తడంతో పాటు, ఆర్థికంగా కూడా కలిసి రాదు.

ధన లాభం కావాలంటే సింగిల్‌ డోర్‌, ఇంట్లో శుభాలు జరగాలంటే డబుల్‌ డోర్‌, దీర్ఘాయువు కోసం 4 డోర్లు, 6 డోర్లు ఉంటే పుత్రలాభం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

16, 32 డోర్ల ఇంట్లో ఉండే వారికి శుభప్రదమైన జీవితం దక్కుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

స్టార్ట్ అయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. దీంతో అయిన సక్సెస్ కొడుతడా..?