దసరాకు వచ్చే సినిమాల లెక్క తేలేది ఎప్పుడు?
TeluguStop.com
ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అన్లాక్ 5 లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ కి అనుగుణంగా థియేటర్లను ఓపెన్ చేయడానికి యాజమాన్యాలు రెడీ అవుతున్నారు.
సినిమా థియేటర్లు అయితే ఓపెన్ కాబోతున్నాయి కానీ ప్రేక్షకులు వస్తారా రారా అనే విషయమై సస్పెన్స్ నెలకొంది.
ప్రేక్షకులు రాకుంటే సినిమాలు విడుదల చేస్తే చాలా పెద్ద నష్టం వాటిల్లుతుంది.ఆ విషయంలో ఇప్పటికే ఫిల్మ్ మేకర్స్ భయాందోళనలో ఉన్నారు.
ఇక ఈ దసరాకు ఏ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి అనే విషయంలో క్లారిటీ లేదు.
విడుదలకు పదుల సంఖ్యలో సినిమాలు రెడీ గా ఉన్నప్పటికీ ఈ సమయంలో సినిమాలను విడుదల చేయాలంటే మేకర్స్ భయపడుతున్నారు.
ఇప్పుడు సినిమాలు విడుదల చేయడం అంటే చాలా పెద్ద సాహసమే అవుతుంది.అంటే ప్రేక్షకులు రాకుంటే అటు ఓటీటీకి ఇటు థియేటర్లకు జనాల రాక కలెక్షన్ లేకపోవడం వల్ల రెండు విధాలుగా నిర్మాతలు నష్టపోవాల్సి వస్తుంది.
అందుకే దసరాకు ఏ సినిమాలు విడుదల అవుతాయి అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
ఒకవేళ విడుదలైతే కొన్ని చిన్న సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది.రెడ్ సినిమాను విడుదల చేస్తామంటూ యూనిట్ సభ్యులు అంటున్నారు.
అయితే వారు దసరా సీజన్ కి విడుదల చేస్తారా లేదా ఆ తర్వాత కొన్ని రోజులకు విడుదల చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్ లు ఓపెన్ కాక పోవడం వల్ల డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి మరి కొన్ని సినిమాలు ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
థియేటర్లో ఓపెన్ అయినా కూడా ప్రేక్షకులు వస్తారా లేదా అనేది అనుమానమే కనుక సినిమా విడుదల విషయంలో ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం లేదు.
ప్రేక్షకులు సంక్రాంతి వరకు థియేటర్లకు వెళతారు అనుకోవడంలేదు అంటూ ప్రముఖ నిర్మాత ఒకరు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆయన చెబుతున్న దాని ప్రకారం కరోనాకు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వచ్చే వరకు థియేటర్లకు గడ్డుకాలమే.
చైనా పరువు గంగపాలు.. ఈ వీడియో చూస్తే డ్రాగన్ కంట్రీపై అభిప్రాయం మారిపోతుంది!