సత్య యుగం ఎన్ని రోజులు ఉంది? అప్పుడు ఏం జరిగిందో తెలుసా?

పురాణాల ప్రకారం మనకు మొత్తం నాలుగు యుగాలు ఉన్నాయి.అందులో మొదటిది సత్య యుగం.

  రెండో ద్వాపర యుగం.మూడోది త్రేతాయుగం.

నాలుగోది కలియుగం.ఈ విషయాలు మన అందరికీ తెలిసినవే.

కానీ మొదటిది అయినటువంటి సత్య యుగం ఎన్ని రోజులు ఉంది అప్పుడు ఏం జరిగిందో మాత్రం చాలా మందికి తెలియదు.

ఇప్పుడు ఆ విషయాల గురించి మనం తెలుసుకుందాం.సత్య యుగంలో నారాయణుడు, లక్ష్మి దేవి సమేతంగా భూమిని పరిపాలించాడాని పురాణాలు చెబుతున్నారు.

మొత్తం సత్య యుగం కాల పరిమాణం 4 లక్షల 32 వేలు * 4 అట.

అంటే మొత్తం 1728000 అనగా 17 లక్షల 28 వేల సంవత్సరాలు అన్నమాట.

 ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడించిందని పురాణ గాథలు వివరిస్తున్నారు.ఆ కాలంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో హాయిగా గడపారని ప్రతీతి.

సత్య యుగ కాలంలో అకాల మరణాలు ఉండేవి కావంట.అంతే కాదండోయ్ ధర్మమే సుప్రీం అని చెబుతుంటారు.

 వైవశ్వత మన్వంతరం ప్రకారం సత్యయుగం కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది.ఆ కాలంలో మనుషులు 21 మూరల ఎత్తు ఉండేవారట.

మానవుడు అన్ని భ్రమల నుంచి విముక్తి పొందేవాడని కూడా అందులో వివరించబడంది.శివుడు, సతీదేవి వివాహ కర్మ సత్య యుగంలో జరిగింది.

 సత్య యుగంలో మానవుడి సగటు ఆయుర్దాయం సుమారు 4000 సంవత్సరాలు అట.ఈ కాలంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కల్గినని జ్ఞానం, ధ్యానం, తపస్సు మాత్రమే.

విశ్వంభర సినిమా మీద హైప్ పెంచుతున్న సాంగ్…