సంవత్సరంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఎన్ని రోజులు అంటే..!
TeluguStop.com
విశాఖ పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో సింహాద్రి పుణ్యక్షేత్రం( Simhadri Appanna ) ఉంది.
ఇక్కడి దేవుడిని సింహాద్రి అప్పన్నగా ప్రజలందరూ ముద్దుగా పిలుస్తూ ఉంటారు.తూర్పు కనుమల్లో సముద్రమట్టానికి దాదాపు 250 మీటర్ల ఎత్తున ఉన్న సింహగిరి అనే పర్వతం మీద కొలువై ఉన్న విష్ణు స్వరూపమే వరాహ నరసింహస్వామి.
అయితే ఈ నరసింహస్వామి( Lakshmi Narasimha Swamy )ని అప్పన్న అని స్థానికులు చెబుతూ ఉంటారు.
అయితే ఈ అప్పన్నకు ఏడాదిలోని 364 రోజులు చందనం పూత పూసి ఉంచుతారు.
"""/" /
ఇంకా చెప్పాలంటే నిజరూప దర్శనం కేవలం సంవత్సరంలో 12 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ విగ్రహం ఎప్పుడూ వేడిగా ఉంటుంది కాబట్టి స్వామి వారిని చల్లబరిచేందుకు చందనం పూత పూస్తూ ఉంటారని పూజారులు చెబుతున్నారు.
ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనాన్ని పూర్తిగా తొలగించి కేవలం 12 గంటల పాటు మాత్రమే స్వామి వారి నిజరూప దర్శనానికి భక్తులకు అనుమతి కల్పిస్తారు.
ఇలా సంవత్సరానికి ఒకసారి చందనం పూర్తిగా తొలగించి తిరిగి 12 గంటల తర్వాత చందనం అలంకరిస్తూ ఉంటారు.
"""/" /
ఈ కార్యక్రమాన్ని చందనోత్సవం అని కూడా పిలుస్తారు.ఈ సమయంలోనే స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటారు.
వైశాఖ శుద్ధ తదియ రోజు ఉదయం స్వామివారికి అలంకరించిన చందనం తీసేసి నిజరూపంలో ఆ రోజు మధ్యాహ్నం అంతా కూడా భక్తులకు దర్శనాన్ని కల్పిస్తారు.
స్వామి వారిని ఆ రోజు రాత్రి తిరిగి చందనం పూత తో అలంకరిస్తారు.
సంవత్సరం పాటు ప్రతి రోజు ఇక్కడ నరసింహ స్వామికి చందన లేపనం జరుగుతూ ఉంటుంది.
ఇక్కడ కొలువై ఉన్న దైవం మహావిష్ణు( Mahavishnu )వు రెండు అవతారాల కలయిక అని ప్రజలు చెబుతున్నారు.
ఇక్కడ విష్ణుమూర్తి వరాహ నరసింహ రూపంలో వెలిశాడు.మూలవిరాట్ కూడా అదే రూపంలో ఉండేదని స్థూల పురాణం చెబుతోంది.
మొటిమల్లేని మెరిసే చర్మం కోసం ఈ మ్యాజికల్ రెమెడీని ప్రయత్నించండి..!