రాధేశ్యామ్.. ఎన్ని కోట్ల వసూళ్లు వస్తే హిట్టో తెలుసా?
TeluguStop.com
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా క్యూట్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్.
ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడుతూ చివరికి నేడు విడుదల అయింది అన్న విషయం తెలిసిందే.
నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.
భారీ అంచనాల మధ్య విడుదలై అదే రేంజ్ లో హిట్ కొట్టే దిశగా ముందుకు సాగుతోంది.
ఇక ఈ సినిమా ఎలాంటి వసూళ్లు సాధించ పోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది.
దాదాపు ఏడు వేల పది తెరలపై ఈ సినిమా ప్రసారం అవుతూ ఉండడం గమనార్హం.
కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ చూసుకుంటే.ఈస్ట్: రూ.
9.90 కోట్లు """/"/
కృష్ణా: రూ.
7.50 కోట్లు
నెల్లూరు: రూ.
4 కోట్లు
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : 105.20 కోట్లు
కర్ణాటక: రూ.
12.50 కోట్లు
తమిళనాడు: రూ.
10 కోట్లు
హిందీ: రూ.50 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: రూ.
3 కోట్లు
ఓవర్సీస్ : రూ.24 కోట్లు """/"/
ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.
202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం గమనార్హం.
మొత్తంగా ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకోవాలి అంటే మాత్రం ఏకంగా 204 కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.
అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ చేసిన మొదటి సినిమా ఇదే.
ఇక మరోవైపు డిజిటల్ శాటిలైట్ రూపంలో కూడా 100 కోట్లు నిర్మాతలకు దక్కినట్లు తెలుస్తోంది.
దాదాపు పదికి పైగా భాషల్లో ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.కాగా ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది అనుకున్నప్పుడు కాస్త ఎక్కువగానే బడ్జెట్ అయింది అన్నట్లు టాక్ ఉంది రాధేశ్యామ్ సినిమా కోసం హిందీలో అమితబచ్చన్ కన్నడ పునీత్ రాజ్కుమార్ మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో నిందితుల అరెస్ట్