కూరలో వేసుకునే ఉప్పు లో కూడా చాలా రకాలు ఉంటాయి.ప్రస్తుత మార్కెట్లో హిమాలయన్ సాల్టు, బ్లూ సాల్టు, సాధారణ ఉప్పు వంటి వివిధ రకాల ఉప్పులు అందుబాటులో ఉన్నాయి.
అయితే ఈ ఉప్పులన్నిట్లో కెల్లా హిమాలయన్ సాల్ట్ చాలా ప్రయోజనాలను కలిగిస్తుందని ప్రచారం జరుగుతోంది.
హిమాలయ పర్వతాల సమీపం లో దొరికే గనుల నుంచి హిమాలయన్ సాల్ట్ తయారుచేస్తారు.
గనుల నుంచి హిమాలయన్ సాల్ట్ తయారు అవుతుంది కాబట్టి సాధారణ ఉప్పు కంటే వీటిలో ఎక్కువగా మినరల్స్ ఉంటాయట.
అందుకే ఈ ఉప్పు ఎరుపు రంగులో కనిపిస్తుందట.కానీ మినరల్స్ ఉన్నంత మాత్రాన ఆరోగ్య లాభాలు కలుగుతాయి అని చెప్పడం అవివేకం.
ఎందుకంటే మినరల్స్ చాలా సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి.ఆ మినరల్స్ మన శరీరంలోకి వెళ్లి మనకు ఆరోగ్య లాభాలు కలిగించాలంటే ప్రతి రోజు దాదాపు రెండు కిలోల హిమాలయన్ సాల్ట్ తినాల్సి ఉంటుంది.
రెండు కిలోల ఉప్పు ఏ మనిషి కూడా తినలేడు కాబట్టి హిమాలయన్ సాల్ట్ నుంచి లభించాల్సిన మినరల్స్ పూర్తిస్థాయిలో లభించవు.
నిజానికి ఒక టీస్పూన్ సాధారణ ఉప్పులో 2300 మిల్లీ గ్రాముల సోడియం ఉంటే ఒక టీ స్పూన్ హిమాలయన్ సాల్ట్ లో 2000 మిల్లీ గ్రాముల సోడియం మాత్రమే ఉంటుంది.
మన శరీరానికి ప్రతిరోజు 2300 సోడియం కావాల్సి ఉంటుంది.సాధారణ ఉప్పు ఒక టీ స్పూను తింటే సరిపోతుంది కానీ హిమాలయన్ సాల్ట్ ఇంకా ఎక్కువగా తినాల్సి ఉంటుంది.
సో, సాధారణ ఉప్పు కంటే హిమాలయన్ సాల్ట్ ఆరోగ్య లాభాలను కలిగించదు.హిమాలయన్ సాల్ట్ ని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే ఎటువంటి చర్మ సమస్యలు దరిచేరవని చెబుతున్నారు.
ఈ ఉప్పు కారణంగా శ్వాసకోస సంబంధిత వ్యాధులు దూరమవుతాయట.వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనం గా తయారవుతారట.
కానీ ఈ లాభాలు చేకూరుతాయని శాస్త్రీయంగా చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.అందుకే సాధారణ ఉప్పు కి హిమాలయన్ సాల్ట్ కి పెద్దగా తేడా ఏమీ లేదని చెప్పుకోవచ్చు.