అమ్మాయిలు రోజూ ఫోన్ ను ఎంతసేపు ఉపయోగిస్తున్నారంటే?

ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండేది.తరువాత కాలక్రమేణా ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక విప్లవం రావడంతో సాంకేతికతకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద డిమాండ్ ఏర్పడింది.

అంతేకాక ఒకప్పుడు ఇంటర్నెట్ చాలా ఖరీదుగా ఉండేది.తరువాత జియో సంచలనం తరువాత ఇంటర్నెట్ కూడా చౌకగా లభించడంతో ఇక ప్రతి ఒక్కరు మొబైల్ వాడకానికి అలవాటుపడ్డారు.

దీనికి అనుగుణంగానే పెద్దపెద్ద కంపెనీలు సైతం మొబైల్ లో తమ వ్యాపారాలను వివిధ యాప్ ల, గేమ్స్ ద్వారా మొబైల్ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి.

చేస్తున్నాయి కూడా.అలా వివిధ రకాల కారణాలతో మొబైల్ ని విడిచి పెట్టి ఉండలేని పరిస్థితి నేడు నెలకొంది.

అసలు నిజం మాట్లాడుకోవాలంటే మొబైల్ ఒక వ్యసనంలా మారిందని చెప్పవచ్చు.అయితే ఇలా మొబైల్ వాడుతున్న వారిలో అమ్మాయిలు రోజుకు ఎంత సేపు మొబైల్ వాడుతున్నారు అని ఓ సర్వే నిర్వహించారు.

ఈ సర్వేలో దేశంలోని యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు రోజుకు గంట కంటే తక్కువ సేవు మొబైల్ వాడుతున్నారని నిర్ధారణ అయింది.

ఢిల్లీ కి చెందిన సెంటర్ ఫర్ క్యాటలైజింగ్ ఛేంజ్, డిజిటల్ ఎం పవర్ మెంట్ ఫౌండేషన్ తో కలిసి ఈ సర్వే నిర్వహించారు.

అంతేకాక తెలంగాణలో పేరెంట్స్ అబ్బాయిలకు ఇచ్చినంత స్వేచ్ఛగా మొబైల్, లాప్టాప్స్ అమ్మాయిలకు ఇవ్వడానికి అంగీకరించడం లేదని ఈ సర్వేలో తేలింది.

కొంతమంది అమ్మాయిలకు తమకు మొబైల్స్,లాప్టాప్స్ కొనుక్కొనే స్థోమత లేదని ఈ సర్వేలో వెల్లడించారు.

ప్రభాస్ సినిమాల్లో వాళ్ల అమ్మకి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా..?