ఒమిక్రాన్ స్కిన్, ప్లాస్టిక్ పై ఎంతసేపు ఉంటుందంటే?

కరోనా మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేసేసింది.అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సామాన్య మధ్యతరగతి జీవితాల్లో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ ఒక్కసారిగా బాంబ్ పేల్చాయి.

దీంతో సామాన్య ప్రజలు ఉపాధి కోల్పోయి, అనారోగ్యంతో ఆస్పత్రుల పాలయ్యారు.బిల్లులు కట్టలేక కొందరు సొంత ఆస్తులు, బంగారాన్ని తాకట్టు పెట్టుకునే వరకు దిగజారి పోయారు.

కరోనా ఎప్పుడైతే దేశంలోనికి ప్రవేశించిందో మానవ సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో తేలిపోయింది.

కరోనా టైంలో నా అనుకునే వాళ్లే ఇంట్లో వారిని దూరం పెట్టారు.దీంతో జనాలు కరోనా ముందు కరోనా తర్వాత అని మాట్లాడుకోవడం మొదలెట్టారు.

కరోనా ఇప్పటికే 2 సార్లు ప్రజలను వణికించింది.తాజాగా థర్డ్ వేవ్‌తో ప్రజలను భయపెట్టేందుకు ముంచుకొస్తుంది.

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కూడా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది.కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పంజా విసురుతోంది.

ఇప్పటివరకు వెలుగు చూసిన వేరియంట్ల కంటే అత్యంత వేగంగా ఒమిక్రాన్ వ్యాపిస్తూ మరింత భయాందోళనకు గురిచేస్తోంది.

అయితే, ఒమిక్రాన్ ఇంత వేగంగా వ్యాప్తి చెందడానికి గల కారణం ఏంటో తాజాగా బయట పడింది.

మనిషి శరీరంపై 21 గంటల పాటు ఒమిక్రాన్ వేరియంట్ నిలిచి ఉంటుందని సమాచారం.

తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం బయటకొచ్చింది. """/"/ అంతేకాదు ప్లాస్టిక్ పై ఈ వేరియంట్ 8 రోజుల పాటు సజీవంగా ఉంటుందని కూడా పరిశోధనలో తెలిసింది.

ఈ పరిశోధనను జపాన్‌కు చెందిన క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్సిటీ కనుగొన్నది.వుహాన్‌లో బయట పడ్డ సార్క్ సిఓవీ-2 ఒరిజినల్ వేరియంట్‌తో పాటు ఇతర వేరియంట్లపై కూడా పరిశోధనలు చేసి ఈ నిర్ధారణ చేశారు.

ఒమిక్రాన్ వేరియంట్లు ఒరిజినల్‌తో పోలిస్తే మనిషి చర్మంపై, ప్లాస్టిక్ పై రెండు రేట్లు అధికంగా జీవించి ఉంటున్నట్టు గుర్తించారు.

ఒమిక్రాన్ మిగతా వాటికంటే ఎక్కువ సామర్ధ్యం ఉన్నందున అధికంగా వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు.

ఒమిక్రాన్ వేరియంట్ ప్లాస్టిక్ పై 193.5 గంటల పాటు ఉండనున్నట్టు పరిశోధకులు తెలిపారు.

అలాగే చర్మం మీద 21.1 గంటలు ఉంటుందని తెలిపారు.

నకిలీ రూ.500 నోట్లని ఇలా గుర్తించండి!