బంగార్రాజులో కృతి శెట్టికి అవకాశం ఎలా వచ్చిందో తెలుసా?

టాలీవుడ్ లో సంక్రాంతి సందర్భంగా పలు సినిమాలు విడుదల అవుతాయని చాలా మంది భావించారు.

కానీ కరోనా మళ్లీ చెలరేగే అవకాశం ఉందని చివరి నిమిషంలో ఆయా సినిమాలను వాయిదా వేశారు దర్శకనిర్మాతలు.

అయితే బంగార్రాజు సినిమా మాత్రం తొలి నుంచి చెప్తున్నట్లుగానే సంక్రాంతికే విడుదల అయ్యింది.

చెప్పింది చెప్పినట్లుగానే జనాల ముందుకు వచ్చింది.వాస్తవానికి ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాలాగే ఉంటుంది.

దాదాపు స్టోరీ కూడా అలాగే ఉంటుంది.పెద్దగా మార్పులు ఏవీ కనిపించవు.

కానీ హీరోయిన్లను మార్చడం మూలంగా కొత్తగా అనిపిస్తుంది.బంగార్రాజు సినిమాకు కల్యాణ్ క్రిష్ణ దర్శకత్వం వహించాడు.

నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య హీరోలుగా చేశారు.రమ్య క్రిష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు.

ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టికి బంగార్రాజులో అవకాశం దొరికింది.

ఇందులో సర్పంచ్ నాగ లక్ష్మిగా మంచి నటన కనబర్చింది.ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యింది.

తన అందం, అభినయంతో బాగా ఆకట్టుకుంది. """/"/ వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్ గా తొలుత కృతి శెట్టిని అనుకోలేదట.

అనుకోకుండా తనకు ఈ అవకాశం దక్కిందట.ఉప్పెన షూటింగ్ సమయంలో కృతి శెట్టిని ఈ సినిమాలో నటించాలని కోరారట.

అయితే అప్పటికే తను రెండు సినిమాలకు ఓకే చెప్పిందట.అందుకే ఈ సినిమాలో చేసేందుకు నో అన్నదట.

దీంతో ఈ సినిమా యూనిట్ హీరోయిన్ గా రష్మిక మందానను ఓకే చేయాలి అనుకున్నారట.

అయితే చివరకు డేట్స్ ఇస్తానని కృతి శెట్టి చెప్పిందట.అనుకున్నట్లుగానే కృతి శెట్టి కి మళ్లీ అవకాశం ఇచ్చారట.

దీంతో రష్మికను అనుకున్నా చివరకు ఆ అవకాశం కృతి శెట్టినే వరించిందట.అనుకున్నట్లుగానే ఈ సినిమాలో కృతి శెట్టి మంచి నటన కనబర్చింది.

సర్పంచ్ నాగ లక్ష్మిగా జనాల మదిని దోచుకుంది.హిట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

మహేష్ బాబు సినిమా కోసం భారీ డిసీజన్స్ తీసుకుంటున్న రాజమౌళి…