Kushboo: 9వ తరగతి చదివిన కుష్బూ ఇంగ్లీష్ అదరగొట్టడానికి కారణమైన ఆ హీరోలు ఎవరు ?

తెలుగు ప్రేక్షకులకు కుష్బూ( Kushboo ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ ముద్దుగుమ్మ 1986లో వచ్చిన కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.

అదే సంవత్సరం కెప్టెన్ నాగార్జున సినిమాలో నటించింది.కెరీర్ స్టార్టింగ్ లోనే నాగార్జున వెంకటేష్ లతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

తర్వాత ఆమె స్టార్ హీరోలతో కలిసి నటించిన లేదు.1993లో మళ్లీ పేకాట పాపారావు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది.

రీసెంట్‌గా ఆడవాళ్లు మీకు జోహార్లు, రామబాణం( Ramabanam ) సినిమాల్లో మెరిసింది.ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో ప్రస్తుతం జడ్జిగా కొనసాగుతోంది.

ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉండటమే కాక బాగా మాట్లాడుతుంది కూడా ముఖ్యంగా ఇంగ్లీష్ లో చాలా అనర్గళంగా మాట్లాడుతూ ఆకట్టుకుంటుంది.

దీంతో ఆమె బాగా ఎడ్యుకేటెడ్ అని చాలామంది అనుకుంటారు కానీ అది అవాస్తవమని తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా కుష్బూనే తెలిపింది.

"""/" / 9వ తరగతి తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశానని కుష్బూ చెప్పింది.

అయితే అంత తక్కువ చదువుకున్నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంత ఫ్లూయెంట్ గా ఎలా మాట్లాడుతున్నారు అంటూ ఒక ఇంటర్వ్యూలో అడిగారు.

దానికి బదులిస్తూ "ఇద్దరు హీరోల వల్ల నేను బాగా ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను.నా ఫస్ట్ హీరో వెంకటేష్( Venkatesh )వల్ల నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను.

తర్వాత నాగార్జున కారణంగా నేను ఇంగ్లీష్ బాగా నేర్చుకోగలిగాను.నా ఫస్ట్ పిక్చర్ వెంకటేష్ తో.

సెకండ్ పిక్చర్ నాగార్జునతో చేయడం జరిగింది.ఇద్దరూ అప్పుడే అమెరికా నుంచి వచ్చి సినిమాల్లో నటించడం స్టార్ట్ చేశారు.

ఆ సమయంలో నాకు ఇంగ్లీషు పెద్దగా రాకపోయేది.దాంతో నేను భారతీయ భాషలో మాట్లాడేదాన్ని.

అప్పుడు 'లేదు, నువ్వు ఇంగ్లీషులో మాట్లాడాలి, ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి' అని ఆ హీరోలు నాకు బాగా చెప్పేవారు.

" """/" / "అంతేకాదు నాగార్జున( Nagarjuna ) నాకొక ఇంగ్లీష్ బుక్ కూడా ఇచ్చారు.

'నువ్వు ఇంగ్లీషు నావెల్స్‌ చదవడం స్టార్ట్ చేయాలి' అని ఆయన నాతో అన్నారు.

ఆంగ్ల నవలలను చదివితే నీకు ఇంగ్లీష్ బాగా వస్తుందని ప్రోత్సహించారు.ఆ విధంగా తొలిసారిగా నేను బుక్ గిఫ్టును నాగార్జున నుంచి అందుకున్నాను.

ఇంగ్లీష్ ఇంత బాగా రావడానికి వెంకటేష్, నాగార్జున అలా కారణమయ్యారు.నేను తప్పకుండా వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి.

" అని చెప్పుకొచ్చింది.