పిక్నిక్‌లో చూసి సినిమాల్లో పెట్టుకుంటే స్టార్ హీరోయిన్ అయిపోయింది..?
TeluguStop.com
స్వయంవరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, నీ ప్రేమకై వంటి సినిమాలతో లయ( Laya ) తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది.
అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి అనుకోకుండా అడుగుపెట్టింది.పిక్నిక్ లో చూసి ఆమెను సినిమాల్లో తీసుకున్నారు.
చిన్నతనంలో ఈ తారకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండకపోయేది కాదు కానీ ఆమెనే ఫస్ట్ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది.
వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా మంచిగా సద్వినియోగం చేసుకుంది.చివరికి స్టార్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది.
"""/" /
లయ 1981, అక్టోబర్ 21న విజయవాడలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.
విజయవాడలోనే చదువుకుంది.లయ తల్లి నిర్మల హైస్కూల్‌లో మ్యూజిక్ టీచర్ గా పని చేసేవారు.
ఆమె తండ్రి ఓ డాక్టర్.లయ చిన్నతనంలో చాలా యాక్టివ్ గా ఉండేది.
అంతేకాదు స్టేట్ లెవెల్ చెస్ ప్లేయర్ కూడా అయింది.ఆపై హైదరాబాద్‌కు వెళ్లి క్లాసికల్ డ్యాన్సర్‌గా ( Classical Dancer ) అనేక స్టేజ్ పర్ఫామెన్స్ లు ఇచ్చింది.
అయితే ఒక రోజు తన తల్లి స్కూల్ తరఫున పిక్నిక్ పెట్టారు ఈ పిక్నిక్ కి ఆలీతో కలిసి లాగా కూడా వెళ్ళింది అక్కడ చాలా అల్లరి చేసింది.
ఎనర్జిటిక్ గా ఆమె అలా ఆడుకుంటుంటే దాన్ని దర్శకుడు అక్కినేని కుటుంబరావు( Akkineni Kutumba Rao ) గమనించాడు.
"""/" /
ఆయన మూవీ తీయాలనుకుంటున్నాడు.అయితే ఆ మూవీకి లయ కరెక్ట్ గా సూట్ అవుతుందని అనుకున్నాడు.
మంచి డాన్సర్ కాబట్టి ఆమెకు ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం కూడా తెలుసు అని అర్థం అయింది.
ఆమెకు సినిమా ఆఫర్ ఇస్తానని చెప్పగానే తల్లి సంతోషంగా ఒప్పుకుంది.ఇలా కూడా మూవీలో చేయడానికి సిగ్నల్ ఇచ్చింది అలా లయతో సినిమా మొదలుపెట్టారు దాని పేరు భద్రం కొడుకో (1992).
( Bhadram Koduko ) ఈ సినిమాలో అర్బన్ ఏరియాస్ లో చిన్నపిల్లలు పేద పిల్లలు చైల్డ్ లేబర్ కి ఎలా గురవుతారో చూపించారు.
ఇందులో లయ చాలా బాగా నటించి గుర్తింపు తెచ్చుకుంది.పెద్దయిన తర్వాత ఆమె స్వయంవరం( Swayamvaram ) సినిమాతో హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం అయింది.
ఈ అచ్చ తెలుగు అమ్మాయి నటించిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
ఈ విధంగా ఆమె మూవీ ఎంట్రీ యాక్సిడెంటల్‌గా జరిగింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో హేటర్స్ లేని స్టార్ హీరోలు వీళ్లే.. ఈ హీరోలు నిజంగా గ్రేట్!