అడవిలో మంటను ఎలా పుట్టించాడో.. ఇది మాములు క్రియేటివిటీ కాదు, భయ్యో!

ప్రపంచంలో ఎంతటి పెద్ద సమస్య తలెత్తినా, దానికి ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది.

కానీ ఆ పరిష్కారాన్ని కనుక్కోవాలంటే ఓపికగా ఉండాలి.కొంతమంది మాత్రం, ఒక సమస్యకు పరిష్కారం కనిపెట్టే ప్రయత్నంలో మరో కొత్త సమస్యను క్రియేట్ చేస్తారు.

ఇటీవల సోషల్ మీడియాలో అలాంటి ఓ ప్రాబ్లమ్ మేకర్ వీడియో వైరల్ గా మారింది.

అడవిలో మనుగడ కోసం ఉపయోగపడే ఓ లైఫ్ హ్యాక్ అంటూ అతను ఈ వీడియోను పోస్ట్ చేశాడు.

ఈ వీడియోల్లో జంగల్‌లో మంట ఎలా రాజేయాలో చూపిస్తారు.అడవిలో మంట వెలిగించే ఒక కొత్త పద్ధతిని చూపిస్తారు.

ఈ రకమైన కొత్త పద్ధతులను 'లైఫ్ హ్యాక్స్' అంటారు.ఈ హ్యాక్స్ మన జీవితాన్ని సులభతరం చేయడానికి, కష్టమైన పరిస్థితుల్లో బతికి మనుగడ సాగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అంటారు.

కానీ ప్రస్తుత వైరల్ వీడియోలో కనిపించింది నిజమైన లైఫ్ హ్యాక్‌లా కనిపించడం లేదు.

ఈ వీడియోలో కనిపించినట్లుగా ఒక వ్యక్తి జంగల్‌లో మంట( Fire ) వెలిగించడానికి చాలా విచిత్రమైన పద్ధతిని ఉపయోగించాడు.

అతను తన చెప్పులోంచి ఒక చిన్న ముక్కను బ్లేడ్ తో కట్ చేసి, దానిలో ఒక అగ్గిపెట్టెని ఉంచాడు.

ఆ తర్వాత, అగ్గిపుల్లల్ని రుద్దే భాగాన్ని తన చెప్పుకు అంటించాడు.అలా చేసి అగ్గి పుల్లని చెప్పుకు రుద్దితే, అది వెలిగి మంటను పుట్టించింది.

"""/" / ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.చాలా మంది ఈ పద్ధతిని చూసి ఆశ్చర్యపోయారు.

కొంతమంది ఈ పద్ధతి వరస్ట్ గా ఉందని, అసలు సమస్య లేకుండా ఉన్నప్పుడు కొత్త సమస్యను సృష్టించిన్నట్లు ఉందని అన్నారు.

మరొకరు, కర్రసామాన్లు కనుక్కొనే ముందు మనుషులు ఇలాంటి పద్ధతులను ఉపయోగించేవారేమో అని హాస్యంగా అన్నారు.

కొందరు మాత్రం ఈ పద్ధతిని విమర్శించారు.అగ్గిపెట్టె లేదా లైటర్ (Match Box, Liter)తీసుకెళ్లడం చాలా సులభం అని, ప్రతి అగ్గిపెట్టెను చెప్పుకు అంటించడం అనవసరం అని అన్నారు.

ఈ పద్ధతి క్రియేటివ్‌గా ఉండొచ్చు కానీ, చాలా మందికి ఇది యూజ్‌లెస్‌గానే అనిపించింది.

అరటిపండు అంటే ఈ మంత్రికి చచ్చేంత భయమట.. వాటిని బ్యాన్ కూడా చేశారు..?