డైరెక్టర్ తేజ ఒక పాత్ర కోసం నటీనటులను ఎలా ఎంచుకుంటాడో తెలుసా ?

ఒక దర్శకుడు తమ సినిమాకి ఏదో ఒక రకంగా హైప్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఉంటాడు.

అందులో నటించేది నటీనటుల ద్వారానో లేకపోతే స్టోరీ ద్వారానో ఇంకొక కాంట్రవర్సీ ద్వారానో ఎలా అయితే ఏంటి సినిమా విజయం సాధిస్తే చాలు అన్నదే దర్శకుల మైండ్ సెట్.

అందుకోసం డైరెక్టర్ తేజ( Director Teja ) లాంటి వ్యక్తి అయితే ఏం చేస్తాడో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.

డైరెక్టర్ తేజ జయం సినిమా( Jayam Movie ) తీస్తున్న టైం లో అందరూ కొత్తవాళ్లతోనే సినిమా తీస్తున్నాడు కాబట్టి తన సినిమా విజయం సాధించడం పై కొంత అనుమానం ఉండేది.

అందుకోసం ఒక చక్కటి ప్లాన్ చేశాడు తేజ.అదేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/" / డైరెక్టర్ తేజ జయం సినిమాకి సంబంధించిన నటీనటులను ఎంచుకున్న క్రమంలో పూర్తిస్థాయిలో కొత్త వాళ్లతోనే సినిమాను నింపేశాడు.

అయితే ఓసారి అందులో నటించే ఒక లెక్చరర్ పాత్ర( Lecturer Role ) కోసం ఎవరిని సెలెక్ట్ చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాడు.

అందుకోసం చెన్నై వెళ్లాడట.అక్కడ ఓ థియేటర్ దగ్గర నిలబడి ఉన్న తేజ అందరూ గోడ దూకి మరి సినిమా థియేటర్లోకి ఎగబడటం చూసాడట.

అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కాసేపటి వరకు తేజాకి ఏమీ అర్థం కాలేదట.

అందులో నడుస్తున్న సినిమా ఏంటా అని ఆశ్చర్యంతో చూడగా కామేశ్వరి చిత్రం .

( Kameswari Movie ) హీరోయిన్ షకీలా( Shakeela ) అని కనిపించిందట.

షకీలా ను చూడడానికి వందల్లో జనాలు ఎగబడటం చూసి ఆశ్చర్యపోయాడట. """/" / మరి అంత గా ఆ సినిమాలో ఏముందో చూద్దామని మూడు టికెట్లు కొనుక్కొని తేజ తో కలిసి ఇంకో ఇద్దరు సినిమాకి వెళ్లారట.

సినిమా చూసి వచ్చిన తర్వాత తని లెక్చరర్ పాత్రకు కావలసిన నటి షకీలా అని  డిసైడ్ అయ్యారట తేజ.

దాంతో అలా ఆ షకీలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి లెక్చరర్ పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చింది.

అప్పటి వరకు కేవలం న్యూడ్ పాత్రలు సెమీ న్యూడ్ పాత్రలు చేసిన షకీలాకు సెకండ్ ఇన్నింగ్స్ గా ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మార్చేశాడు.

మొత్తానికి తేజాకు కావలసిన షకీలా దొరికింది.షకీలాకు కావాల్సిన జీవితం తేజ ఇచ్చారు.

జయం సినిమాకి కావలసిన మంచి హైప్ కూడా వచ్చేసింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్19, శనివారం 2024