అసలు నువ్వెలా డైరెక్టర్ అయ్యావు… హరీష్ శంకర్ పై భారీ ట్రోల్స్!

చంద్రయాన్ 3 ( Chandrayaan 3 ) సక్సెస్ కావడంతో యావత్ భారత దేశం మొత్తం ఎంతో గర్వపడుతున్నారు.

చంద్రుని దక్షిణ ధ్రువం పై విక్రం లాండర్ లాండ్ అవడంతో ప్రతి ఒక్కరు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇలా చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు ఈ విజయం పై హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టుల చేస్తున్నారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ ( Harish Shanker ) సైతం చంద్రయాన్ త్రీ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.

"""/" / చంద్రుడు దక్షిణ ధ్రువం పై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన ఫోటోతో పాటు మరోవైపు పాకిస్తాన్ జండా ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.

అయితే ఈ రెండు ఒకటి కాదు అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

చంద్రుడిపై జెండా జెండాపై చంద్రుడు(పాకిస్తాన్ జెండా) రెండు ఒకటి కాదు అనే మీమ్ షేర్ చేసారు.

దీంతో ఈయన చేసిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది చూసినటువంటి నెటిజన్స్ ట్రోల్ మొదలుపెట్టారు. """/" / భారతదేశం గొప్పదనం గురించి చెబుతూ ఇలా పాకిస్తాన్( Pakistan ) ప్రస్తావన తీసుకురావడం అవసరమా.

అసలు మనకు ఆ దేశంతో ఇప్పుడు అవసరమా ఇప్పుడు కూడా మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారి గురించి ఆలోచించకూడదు పై స్థాయిలో ఉన్న వారితోనే మనం పోల్చుకోవాలి.

భారతదేశం ఎంతో మంచి విజయం అందుకున్నటువంటి తరుణంలో హరీష్ శంకర్ ఇలా పాకిస్తాన్ నెటిజన్స్ ఈయనని ట్రోల్ చేస్తూ అసలు నువ్వు ఎలా డైరెక్టర్ అయ్యావు కనీసం ఈ మాత్రం కూడా తెలియదా అంటూ నేటిజన్స్ మండిపడుతున్నారు.

ప్రమోషన్ వీడియో మీద సిద్ధార్థ్ రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి..?