తిరుమలలో మాడ వీధులకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో తరచు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంటారు.

ఈ బ్రహ్మోత్సవాల సమయంలో 11 రోజులపాటు స్వామివారిని వివిధ అలంకరణలో అలంకరించి వివిధ వాహనాలపై తిరుమల మాడ వీధులలో ఉరేగిస్తూ ఉంటారు.

అయితే ఇప్పటివరకు మాడవీధులు అనే పేరు వినే ఉంటాం కానీ అసలు ఈ మాడవీధులు అంటే ఏమిటి? ఈమాడ వీధులకు ఏ విధంగా ఆ పేరు వచ్చాయనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

అయితే తిరుమల మాడ వీధులకు ఆ పేరు ఎలా వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.

తిరుమలలోని శ్రీవారి ఆలయం చుట్టూ నాలుగు వైపుల ఉన్న ప్రధాన రహదారులనే మాడ వీధులు అంటారు.

తమిళంలో ఈ ఆలయం చుట్టూ ఉన్న రహదారుల పక్కన అర్చకులు నివసించడానికి ఉండే ఇళ్ళను మాడం అని పిలిచేవారు.

ఈ పేరే క్రమంగా మాడవీధులుగా మారింది.నాలుగు దిక్కులలో ఉన్న ఈ ఈ రహదారులను తూర్పు మాడ వీధి, పడమర మాడ వీధి, ఉత్తరమాడ వీధి, దక్షిణ మాడ వీధి అనే పేర్లతో పిలుస్తారు.

"""/"/ పూర్వం శ్రీవారి ఆలయం చుట్టూ ఈ విధమైనటువంటి రహదారులు లేకపోవడంవల్ల స్వామివారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ధ్వజారోహణ చేసి మిగతా కార్యక్రమాలను తిరుచానూరులో చేసేవారు.

శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగించడానికి ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే ఈ ఆలయం చుట్టూ ఉన్న రహదారులను వెడల్పు చేసి వాటిని మాడవీధులుగా ఏర్పాటు చేశారు.

ఈ విధంగా అప్పటి నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిపినప్పుడు ఈ నాలుగు మాడ వీధుల వెంట స్వామివారిని మిగతా వాహనాలపై వివిధ అలంకరణలో ఊరేగిస్తారు.

కెనడా రాజకీయాల్లో భారతీయుల హవా.. ఈసారి ఎన్నికల్లో ఎంత మంది బరిలో ఉన్నారంటే?