టర్కీలో అత్యంత అందమైన లేడీ బైకర్ మృతి.. ఎలాగంటే..?

రష్యాలోనే అత్యంత అందమైన బైక్ రైడర్ తత్యానా ఒజోలినా( Bike Rider Tatyana Ozolina ) గురించి మీకు తెలిసే ఉంటుంది.

చాలా ప్రదేశాల్లో ఈమె రైడింగ్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.

ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.అయితే దురదృష్టం కొద్దీ ఆమె టర్కీలో చోటు చేసుకున్న ఒక ప్రమాదంలో చనిపోయింది.

ఆమె తన రెడ్ కలర్ BMW S1000RR బైక్‌పై( BMW S1000RR Bike ) ముగ్లా నుంచి బోడ్రమ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఆమెతో కలిసి ప్రయాణిస్తున్న ఒక టర్కీ బైకర్ తీవ్రంగా గాయపడ్డాడు.మరొక బైకర్ మాత్రం సురక్షితంగా ఉన్నాడు.

తత్యానా తన బైక్‌పై కంట్రోల్ కోల్పోయి, మిలాస్ దగ్గర ఒక ట్రక్‌ను ఢీకొన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.మోటోమోస్కో అసోసియేషన్ అధ్యక్షుడు అండ్రే ఇవానోవ్,( Andrey Ivanov ) తత్యానా ఒజోలినాను గుర్తు చేస్తూ, "మోటోతన్య ఇక మనతో లేరు.

ఆమె జీవితం చాలా బ్రైట్‌గా ఉండేది" అని చెప్పారు.ఇవానోవ్ మిలియన్ల మంది ఆమెను ఇష్టపడేవారని, "దేశంలో తత్యానా గురించి తెలియని మోటార్‌సైకిల్‌ రైడర్ ఒక్కరు కూడా ఉండరు" అని అన్నారు.

"""/" / "ఆమెను ప్రేమించారు, అసూయపడ్డారు, ఆరాధించారు, అనుకరించారు, టాప్ బ్లాగర్‌గా అవార్డులు( Awards As Top Blogger ) అందుకున్నారు.

అదే సమయంలో ఆమె గురించి చాలా చెడుగా మాట్లాడారు" అని ఇవానోవ్ అన్నారు.

38 ఏళ్ల వయసులో ఉన్న ఈ బైక్ రైడర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల మంది, టిక్‌టాక్‌లో 50 లక్షల మంది, యూట్యూబ్‌లో 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

తాను ప్రయాణించే వీడియోలను తరచూ తన ఫ్యాన్స్‌తో పంచుకునేది. """/" / రష్యా-ఉక్రెయిన్( Russia-Ukraine ) యుద్ధం కారణంగా రష్యా వాసులపై యూరోపియన్ యూనియన్ నిబంధనలు విధించింది.

గ్రీస్ ద్వారా యూరప్‌లో ప్రయాణించడానికి ఆమెకు అనుమతి ఇవ్వలేదు.దీంతో ఆమె తన సమ్మర్ టూర్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

ఈ విషయం మీడియాలో చాలా చర్చనీయాంశమైంది."యూరప్‌లో బైక్ నడపలేకపోయినందుకు నాకు బాధేసింది కానీ, ఇలా జరగొచ్చు అని నాకు తెలుసు.

కాబట్టి ఈ అందమైన, వెచ్చని టర్కీని జయించడానికి వెళ్తున్నాను" అని ఆమె రాసింది.

డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్.. ఒబామా మౌనం వెనుక..?