మహేష్ బాబు, విజయ్ దేవరకొండ ఇలా ఎలా చేశారు..?
TeluguStop.com
సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు చేయడానికి కమెడియన్లు చాలా మంది ఉంటారు కానీ ఒక సినిమాలో మాత్రం హీరోనే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అటు హీరో గా చేస్తూ ఇటు కామెడీ కూడా చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నవారు ఉన్నారు ఆయన ఎవరంటే హీరో మహేష్ బాబు( Mahesh Babu ) అనే చెప్పాలి.
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas )డైరెక్షన్ లో మహేష్ బాబు హీరో గా వచ్చిన ఖలేజా సినిమా( Khaleja Movie )లో మహేష్ బాబు కామెడీ సూపర్ గా చేసి తన కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఈయన ఆ సినిమా లో చేసిన యాక్టింగ్ కి ఈయనకి చాలా మంచి పేరు రావడమే కాకుండా మహేష్ బాబు ఇంత బాగా కామెడీ చేస్తాడా అంటూ విమర్శకులు సైతం ప్రశంశలు కురిపించారు.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయిన కూడా ఈ సినిమాకి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి.
"""/" /
ఇక పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడు అయితే ఆయన చేసిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు కానీ ఆయన రెండోవ సినిమా అయిన అర్జున్ రెడ్డీ సినిమా( Arjun Reddy ) లో వేరియేషన్స్ తో కూడిన నటన ని ప్రేక్షకులకి అందించి తనకి ఉన్న ఇంకో టైప్ నటుడిని కూడా బయటికి తీసి మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు.
పెళ్లి చూపులు చూసిన చాలా మంది ఆ సినిమా లో చేసిన విజయ్ ఈ సినిమాలో ఇంతలా వెరిషన్ చూపిస్తూ చేసి జనాలని మెప్పించాడు అంటే జనాలు అందరూ ఒక్కసారి గా షాక్ అయ్యారు.
కానీ విజయ్ నటనతోనే అర్జున్ రెడ్డి అందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది.నిజానికి ఈయన ఈ సినిమా చేయకపోతే మాత్రం ఆయన కి ఇంతలా గుర్తింపు వచ్చేది కాదు.
అందుకే కొన్ని క్యారెక్టర్స్ చేసేటపుడు చాలా జాగ్రత్త గా చేయాలి మన వంతు గా మనం దాని పైన ఎఫార్ట్ పెట్టీ వర్క్ చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది.
"""/" /
ఇలా మహేష్ బాబు లోని కామెడీ యాంగిల్ ను ఎలాగైతే ఖలేజా సినిమా బయటికి తీసుకు వచ్చిందో అలాగే అర్జున్ రెడ్డీ కూడా విజయ్ లో దాగిఉన్న నటున్ని పూర్తిస్థాయిలో బయటికి తీసుకువచ్చింది.
అందుకే ఈ ఇద్దరు నటులకు కూడా ఈ రెండు సినిమాలు చాలా వరకు ప్లస్ అయ్యాయి అనే చెప్పాలి.
వీటి వల్లే వీళ్ళు ఈ యాంగిల్లో కూడా చేయగలరా అని అందరూ ఆశ్చర్య పోయేలా యాక్టింగ్ చేసి మెప్పించారు.
వీడియో: బిర్యానీలో ఐస్‌క్రీమా.. ఈ ఫుడ్ కాంబినేషన్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!