దేవదాసు సినిమా మధ్యలోనే చనిపోయిన ఈ సంగీత దర్శకుడి మరణానికి కారణం ఏంటో తెలుసా?

దేవదాసు.తెలుగు సినిమా పరిశ్రమతో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న సినిమా.

అక్కినేని నాగేశ్వర్ రావు, సావిత్రి హీరో, హీరోయిన్లుగా చేయగా.వేదాంతం రాఘవయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఈ సినిమా ఏఎన్నార్, సావిత్రి నటనా జీవితంలో, ఘంటసాల, సముద్రాల రాఘవాచార్య గాన సాహిత్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ చిత్రం.

1953లో విడుదల అయిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది.అయితే ఈ సినిమా చేస్తున్న సమయంలో ఊహించని ఘటన జరిగింది.

ఇంతకీ అదేంటో ఇప్పుడు చూద్దాం.దేవదాసు సినిమాకు సి.

ఆర్ సుబ్బరామన్ సంగీతం అందించాడు.అయితే ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే కేవలం తన 29వ ఏటనే ఆయన చనిపోయాడు.

అయితే ఆయన మరణం పై అనేక రూమర్లు వచ్చాయి.ఎందుకంటే ఆయన దేవదాసు సినిమా నిర్మాణ సంస్థ వినోదా పిక్చర్స్ లో షేర్ హోల్డర్ గా కూడా ఉన్నాడు.

ఆయన హఠాన్మరణాన్ని వాళ్ల వ్యాపార విబేధాలతో ముగిపెట్టారు కొందరు.గొడవల కారణంగానే కొందరు శత్రువులు తనకు విషం పెట్టి చంపేశారని ప్రచారం చేశారు.

"""/"/ నిజానికి సుబ్బ రామన్ కకు చిన్నప్పటి నుంచి తరుచుగా ఫిట్స్ వచ్చేవి.

ఆ ఫిట్స్ మూలంగానే గుండెపోటు వచ్చిన ఆయన మరణానికి కారణం అయ్యాయని మరికొందరు చెప్పారు.

ఇదే విషయాన్ని ప్రముఖ సినిమా నటుడు కొండల్ రావు వెల్లడించాడు.అటు సుబ్బరామన్ అసిస్టెంట్ ఎమ్మెస్ విశ్వనాథన్.

తన గురువు ఒప్పుకున్న సినిమాలన్నింటినీ ఎంతో నిజాయితీతో వయొలిన్ ఆర్టిస్టు రామ్మూర్తితో కలిసి పూర్తి చేశవారు.

"""/"/ ఈ ఇద్దరు అనంతరం పలు సినిమాలకు కలిసి సంగీతం అందించారు.

కొంతకాలం విశ్వనాథం – రామ్మూర్తి పేరుతో సంగీతం సమకూర్చారు.ఇక దేవదాసు సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ వీరిద్దరే ఇచ్చారు.

అటు అందం చూడవయా పాటతో పాటు జగమే మాయ పాటకు విశ్వనాథం బాణీలు సమకూర్చాడు.

అంతేకాదు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?