రాజబాబు మందు ఎలా అలవాటు చేసుకున్నారో తెలుసా..?

కమెడియన్ రాజబాబు( Comedian Rajababu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ హాస్యనటుడు ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కువగా నటించేవారు.విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ తీసిన ఎన్నో సినిమాలు ఆయన చాలా చక్కని పాత్రలు వేసి మెప్పించారు.

వాటిలో "ఆత్మ బంధువు (1962)"( Aathma Bandhuvu ) సినిమా గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి.

ఈ తెలుగు డ్రామా సినిమాని P.S.

రామకృష్ణారావు డైరెక్ట్ చేశాడు.K.

V.మహదేవన్ సంగీతం అందించిన ఈ మూవీలో ఎన్టీఆర్, సావిత్రి నటించారు.

ఈ మూవీలో రాజాబాబు మోహన్‌గా నటించిన మెప్పించారు.ఈ పాత్ర చేసినందుకుగాను ఆయనకు 800 వందల రూపాయలు పారితోషికంగా ఇచ్చారు.

హైదరాబాద్‌లో ఆయనకు ఒక చిన్న హోటల్‌లో ఓ రూమ్ లో బస కల్పించారు.

అదే రూమ్ లో మరో ఇద్దరు చిన్న నటులు కూడా ఉండేవారు. """/" / ఆ రోజుల్లో రాజబాబు చాలా బక్కగా ఉండేవారు.

చూసేందుకు సన్నగా, పీలాగా కనిపించేవారు.అయితే అతన్ని చూసి అతడి రూమ్‌మేట్స్ "నువ్వు మరీ అంత బక్కగా ఉంటే సినిమాల్లో రాణించలేవు" అనేవారు.

మంచి ఫిజిక్ ఉంటేనే ఛాన్స్ లు వస్తాయి అని హితోపదేశం చేసేవారు.అందుకోసం బీరు తాగు అంటూ వాళ్లు చెబుతూ ఉండేవారు.

ఈ బీరోపదేశం రాజబాబుకు బాగా ఎక్కింది.అందుకే ఆయన వెంటనే బీర్ షాప్ కి వెళ్లి మూడు బీర్ సీసాలు కొనుక్కొని తాగేశారు.

ఆ తర్వాత ఆయనకు తాగుడు అలవాటయింది.తర్వాత ఆ మద్యపానాన్ని( Alcohol ) ఆయన మానేయ లేకపోయారు.

"""/" / ఆ ఇద్దరు నటలు ఇతనికి ఈ బీరోపదేశం చేయకపోయి ఉంటే రాజబాబు ఆరోగ్యంగా జీవించే ఉండేవాడు.

రాజా బాబు 1965లో లక్ష్మి అమ్మలును( Lakshmi Ammalu ) పెళ్లి చేసుకున్నారు.

ఆమె రచయిత శ్రీశ్రీకి కోడలు కావడం విశేషాలు.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వారి పేర్లు నాగేంద్ర బాబు, మహేష్ బాబు.రాజబాబుకి నలుగురు సోదరులు ఉన్నారు.

వారిలో చిట్టి బాబు అనంత్ బాబు కూడా సినిమా రంగంలోకి ప్రవేశించారు.ఈ నటులు టీవీ సీరియళ్లలో కూడా నటించి మెప్పించారు.

అతనికి ఐదుగురు సిస్టర్స్ ఉన్నారు.రాజబాబు అత్యుత్తమ తెలుగు కమెడియన్లలో ఒకరిగా నిలిచాడు.

2012లో రాజబాబు జన్మస్థలమైన రాజమండ్రిలో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రారంభించే ఆదరణ పట్ల తమకున్న మమకారాన్ని తెలుగువారు చాటుకున్నారు.

రాజబాబు సినిమాలు ఇప్పటికీ తెలుగువారిని కడుపుబ్బా నవ్విస్తున్నాయి.రాజబాబు 45 ఏళ్లకే చనిపోయారు.

స్టార్ హీరో ప్రభాస్ కే ఎందుకిలా.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైనా ఆ లోటు ఉండిపోయిందా?