ప్రభాస్ కు తల్లిగా నేనెలా నటిస్తాను.. మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాహుబలి.ఈ సినిమాలో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలిసిందే.

అలాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ చేసిన శివగామిని పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది.

ఈ సినిమాలో రమ్యకృష్ణ తన అద్భుతమైన నటనతో శివగామి పాత్రను చేసి ఈ సినిమాను మరొక లెవల్ కు తీసుకొని వెళ్లారు అని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రలో మొదటి రమ్యకృష్ణకు బదులుగా పలువురిని సంప్రదించారు అన్న వార్త స్వయంగా రాజమౌళిని పలుసార్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ నటించిన శివగామిని పాత్ర కోసం రాజమౌళి పలువురుని సంప్రదించగా వారిలో మంచు లక్ష్మి కూడా ఉన్నారు.

రమ్యకృష్ణ కంటే ముందు శివగామిని పాత్ర కోసం మంచు లక్ష్మి ని సంప్రదించారట రాజమౌళి.

కానీ మంచు లక్ష్మి మాత్రం ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట.ఆమె రిజెక్ట్ చేయడానికి బలమైన కారణం కూడా ఉంది అని తెలిపింది మంచు లక్ష్మి.

అదేమిటంటే ప్రభాస్ కు తల్లిగా నేను చేయాలి అనుకోలేదు.ఇండియాలో మనం ఒక పాత్రలో నటించిన తర్వాత దానిలోనే ఉండిపోతాం.

నేను ఒక రోల్ లో డిఫైన్ అవ్వాలి అనుకోలేదు.ఆ సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత నిజానికి నేను చాలా గర్వపడ్డాను.

"""/"/ హమ్మయ్య నేను ఆ సినిమా చేయలేదు అనుకున్నాను.అయితే అదొక ప్రత్యేకమైన సినిమా కావచ్చు కానీ ఆ పాత్రకు నేను కరెక్ట్ అని నాకు అనిపించలేదు అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.

నా లైఫ్ నా కెరియర్ను దృష్టిలో పెట్టుకొని నేను ఆ నిర్ణయం తీసుకున్నాను.

కానీ బాహుబలి ఐరేంద్రి క్యారెక్టర్ ఇంకొకటి రాలేదు రాబోదు కూడా అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.

టాలీవుడ్ లో ఆమె నటించిన అనగనగా ఒక ధీరుడు సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమాలో ఐరేంద్రి అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటించింది లక్ష్మి.

ఆ సినిమా ఊహించని విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది కానీ ఆ సినిమాలు తాను చేసిన పాత్ర మాత్రం ఆల్ టైం ఫేవరెట్ అని చెబుతూ ఉంటుంది మంచు లక్ష్మి.

కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్ధుల హత్య .. రంగంలోకి విదేశాంగ శాఖ