టీమిండియా VS సౌతాఫ్రికా: ఆ టెస్టుకు ‘బాక్సింగ్ డే టెస్టు’ అనే పేరెలా వచ్చిందో తెలుసా..?

టీమిండియా vs సౌతాఫ్రికా: ఆ టెస్టుకు ‘బాక్సింగ్ డే టెస్టు’ అనే పేరెలా వచ్చిందో తెలుసా?

ఈరోజు అంటే ఆదివారం నాడు భారత్ - దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ జట్లు టెస్ట్ సిరీస్ ఆడనున్నాయి.

టీమిండియా vs సౌతాఫ్రికా: ఆ టెస్టుకు ‘బాక్సింగ్ డే టెస్టు’ అనే పేరెలా వచ్చిందో తెలుసా?

అయితే ఈ టెస్టులను బాక్సింగ్ డే టెస్టుగా పిలుస్తున్నారు.దాంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

టీమిండియా vs సౌతాఫ్రికా: ఆ టెస్టుకు ‘బాక్సింగ్ డే టెస్టు’ అనే పేరెలా వచ్చిందో తెలుసా?

క్రికెట్ మ్యాచ్‌లకు బాక్సింగ్ డే అనే పేరు ఎందుకు పెట్టారని క్రికెట్ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్టు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.డిసెంబర్ 26కు, బాక్సింగ్ క్రీడకు ఎలాంటి సంబంధం లేదు.

ఇక్కడ బాక్సింగ్ అంటే గిఫ్ట్ బాక్సులకు సంబంధించింది.క్రిస్మస్ తర్వాతి రోజు అంటే డిసెంబర్ 26న యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాల్లోని ప్రజలు తమ బంధువులకు గిఫ్ట్ బాక్స్‌లను అందిస్తుంటారు.

యజమానులు కూడా తమ వద్ద పని చేసే వారందరికీ గిఫ్ట్ బాక్స్ లు ఇస్తారు.

అయితే క్రిస్మస్ పండుగ రోజు, అలాగే ఆ తర్వాత రోజు అందజేసే బహుమతులను చాలామంది డిసెంబర్ 26వ తేదీన ఓపెన్ చేసి చూస్తుంటారు.

కుటుంబ సభ్యులతో ఎంచక్కా కబుర్లు పెడుతూ తమ బంధువులు, యజమానులు ఇచ్చిన బాక్సులను విప్పుతారు.

ఈ విధంగా ఈరోజును బాక్సింగ్ డే అని పిలవడం ప్రారంభించారు.ఈ రోజు క్రికెట్ మాత్రమే కాదు ఏ ఆట జరిగిన దాన్ని బాక్సింగ్ డే ఆటగానే పేర్కొంటారు.

"""/" / 1950 లో మొదటిసారిగా డిసెంబర్ 26న ఒక టెస్ట్ జరిగింది.

అప్పట్లో దీనిని బాక్సింగ్ డే టెస్టు అని పేర్కొన్నారు.ఆ సమయం నుంచి డిసెంబర్ 26వ తేదీన జరిగే అన్ని టెస్ట్ మ్యాచ్‌లను కూడా బాక్సింగ్ డే టెస్ట్ గా అభివర్ణిస్తున్నారు.

టీమిండియా దక్షిణాఫ్రికా తో భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 26 మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.

భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ఈ సిరీస్ ఒక అగ్నిపరీక్షగా మారనుంది.

అలాగే విరాట్ కోహ్లీ ఈ సిరీస్ తో తన సత్తా ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.