ఒలింపిక్ క్రీడలకు చైనా కృత్రిమ మంచును ఎలా తయారు చేసిందో తెలిస్తే..
TeluguStop.com
ఇటీవల చైనా రాజధాని బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించారు.100శాతం కృత్రిమ మంచును ఉపయోగించిన మొదటి ఒలింపిక్ క్రీడలు ఇవి.
డీడబ్లు తెలిపిన వివరాల ప్రకారం కృత్రిమ మంచు తయారీకి రెండు మార్గాలు ఉన్నాయి.
వీటి ద్వారా మంచు క్రియేట్ అవుతుంది.మంచు ఎలా పేరుకుపోతుందో తెలుసుకోవడం ద్వారా దీనిని రూపొందిస్తారు.
ముందుగా మంచు తయారీకి అందుకు కావాల్సిన నీటిని శుద్ధి చేస్తారు.ఈ నీటిని స్ప్రే రూపంలో నేలపైకి వెదజల్లే యంత్రంలో నింపుతారు.
వాతావరణాన్ని చల్లబరిచే వాయువుల పైపులు నేల కింద అమరుస్తారు.దీనిపై మంచు నిక్షేపితమవుతుంది.
ఈ పైపుల నుంచి వెలువడే వాయువులు భూమిని చల్లబరుస్తాయి.గ్యాస్ పైపును ఇన్స్టాల్ చేసిన తర్వాత, మంచు గడ్డకట్టడం మొదలవుతుంది.
యంత్రంలో ఉన్న శుద్ధి చేయబడిన నీరు స్ప్రే రూపంలో చల్లని ఉపరితలంపై వెదజల్లతారు.
గ్యాస్ కారణంగా భూమి యొక్క ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గుతుంది.దీంతో ఆ స్ప్రే భూమిని తాకగానే నీరు గడ్డకట్టడం మొదలవుతుంది.
నేలపై మంచు పొర కొన్ని సెంటీమీటర్ల వరకు గడ్డ కడుతుంది.మంచు పొర ఏర్పడిన తర్వాత అది గట్టిపడేలా ఒత్తిడి జరుగుతుంది.
మంచును గడ్డకట్టించడానికి స్నో మెషిన్ కూడా ఉపయోగపడుతుంది.ఈ యంత్రంలో ఒక వైపు నుండి నీరు బయటకు వస్తుంది.
మరొక వైపు నుండి యంత్రంలో ఉన్న వాయువు నీటిని మంచుగా మారుస్తుంది ఈ విధంగా క్రీడల కోసం కృత్రిమ మంచును తయారు చేశారు.
మంచు రూపకల్పనకు చైనా.ఇటాలియన్ కంపెనీ టెక్నోఅల్పిన్ నుండి 383 స్నో గన్‌లను ఆర్డర్ చేసింది, వీటి ధర 60 మిలియన్ డాలర్లు.
ఇంతేకాకుండా మంచు తయారీకి 50 మిలియన్ గ్యాలన్ల నీటిని కూడా ఉపయోగించారు.అయితే ఈ మంచు తయారీకి మొత్తంగా ఎంత ఖర్చయిందన్న వివరాలను చైనా అధికారికంగా వెల్లడించలేదు.
ఓ ఫ్యామిలీని రోడ్డుపై పడేసి స్వేచ్ఛగా తిరుగుతున్నావా.. పవిత్ర గౌడపై విమర్శలు!