జగన్ పాలనా ఏ విధంగా ఉంది అంటే ?
TeluguStop.com
ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వం ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.
ఇప్పటికే లెక్కకు మించి సంక్షేమ పథకాలు ఏపీలో అమలు చేసి జగన్ నిజంగా సూపర్ సీఎం అనిపించుకుంటున్నారు.
అదే సమయంలో విమర్శలు కూడా ఎదుర్కుంటున్నారు.ఎవరు ఏ విధంగా అనుకున్నా ఫర్వాలేదు తాను చెప్పిందే అమలు జరిగి తీరాలనే మంకుపట్టు జగన్ లో ఎక్కువ కనిపిస్తోంది.
"""/"/అందుకే ఎన్ని విమర్శలు వస్తున్నామొండిగానే ముందుకు వెళ్తున్నాడు.ఈ విషయాలను కాస్త పక్కన పెడితే ప్రస్తుతం ప్రభుత్వాధినేతగా ఉన్న జగన్ ఆ ప్రభుత్వం మీద పట్టుకోల్పోతున్నారా ? పట్టు పెంచుకుంటున్నారా అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే టీడీపీ ప్రభుత్వం హయాంలో తీసుకున్న అన్ని నిర్ణయాలపైనా జగన్ పున సమీక్ష చేపట్టారు.
అయితే ఇలా చేయడం ద్వారా ముందు ముందు ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేసినా జగన్ పట్టించుకోకుండా ముందుకే వెళ్ళాడు.
"""/"/జగన్ కు గతంలో పరిపాలన అనుభవం లేకపోవడంతో అన్ని విషయాల్లోనూ దూకుడుగా వెళ్తున్నారు.
అయితే ఇది సరైన విధానం కాదని, దీనివల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాల్సిన సీనియర్ అధికారులు అలా చెప్పేందుకు సాహసం చేయడంలేదు.
ఇక జగన్ మంత్రి మండలి కూడా అదే విధంగా తయారయ్యింది.వైసీపీ ప్రభుత్వంలో ఇసుక విధానం రద్దుతో మొదలైన వివాదంలో మంత్రులు ఎవరికి వారు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ గందరగోళంలో పడేస్తున్నారు.
మీడియా ముందు కూడా ఇదే రకంగా మాట్లాడుతూ అభాసుపాలవుతున్నారు.రాజధాని విషయంలో అయితే ఇప్పటివరకు ప్రభుత్వ విధానం ఏంటో కూడా అర్ధం కావడంలేదు.
పురపాలక మంత్రి బొత్స రాజధాని విషయంలో స్పందిస్తున్నప్పటికీ రోజుకో రకమైన స్టేట్మెంట్ ఆయన ఇస్తున్నాడు.
"""/"/ఇక జగన్ మంత్రిమండలి లో చాలా ముఖాలు కొత్తవే కావడం, పరిపాలన అనుభవం లేకపోవడంతో ప్రతి శాఖ తరపున సీనియర్ మంత్రులే స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక ప్రత్యర్థి పార్టీలు ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నామంత్రులు, సీనియర్ నాయకులు మౌనంగానే ఉండిపోతున్నారు తప్ప విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోతూ, అలంకారప్రాయంగా తయారయ్యారని విమర్శలు ఎదుర్కుంటున్నారు.
తాజాగా సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహారాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఎల్వీ జారీ చేసిన నోటీసులు అందుకున్న అధికారి ప్రవీణ్ ప్రకాష్ తోనే బదిలీ చేయించి ఎల్వీని ప్రాధాన్యం లేని శాఖకు మార్చారు.
"""/"/ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల మధ్య సఖ్యత లేదు అనే విషయం అర్ధ అయిపోతోంది.
సిఎస్ బదిలీకి ప్రభుత్వం చెప్పిన కారణాలైతే సీఎంగా జగన్ ఏ మాత్రం పట్టుసాధించలేకపోతున్నారనే భావన అందరిలోనూ కలిగించింది.
అలాగే పాఠశాల విద్యాశాఖ ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరును తొలగించి వైఎస్ రాజశేఖరరెడ్డి పురస్కారాలుగా మార్చడానికి వీలుగా జారీ చేసిన జీవో 78 విషయంలో కూడా ప్రభుత్వం ఇదే తరహా ప్రకటన చేసింది.
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరగడంతో అసలు ఆ జీవో తనకు తెలియకుండానే వచ్చింది అంటూ జగన్ అధికారుల మీద తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
ఇలా చెప్పుకుంటే జగన్ పాలనలో ఎన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయో అదే స్థాయిలో మైనెస్ లు కనిపిస్తున్నాయి.
డాకు మహారాజ్ రివ్యూ & రేటింగ్