Puhspaka Vimanam : మాధురి దీక్షిత్ చేయాల్సిన పాత్ర కు అమల ఎలా వచ్చి చేరింది ?
TeluguStop.com
ఇండియన్ మూవీ హిస్టరీలో చాలా గొప్ప సినిమాలు తెరకెక్కాయి.వాటిలో తొలి వరుసలో ‘పుష్పక విమానము’( Puhspaka Vimanam ) సినిమా తప్పక ఉంటుంది.
కమల్‌హాసన్ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెన్సేషన్‌గా నిలిచింది.
దానికి కారణం ఏంటంటే, ఈ మూవీలో ఒక్క డైలాగ్ కూడా ఉండదు.మాటల్లేకుండా మూకీ చిత్రంగా వచ్చినప్పటికీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నటీనటుల ఎక్స్‌ప్రెషన్స్‌తోనే ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.1987లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లను వసూలు చేయలేదు.
కానీ మూవీలో నటించిన వారికి, దర్శక నిర్మాతలకు, మిగతా క్రూ సిబ్బందికి మంచి పేరు తెచ్చి పెట్టింది.
ఈ మూవీలో కమల్ హాసన్ నటన వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు.
"""/"/ ఇక ఎల్.వైద్యనాథన్ మ్యూజిక్ మనసును హత్తుకుంటుంది.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను సింగీతం శ్రీనివాసరావే అందించాడు, అలానే దీనిని ఆయనే ప్రొడ్యూస్ చేశాడు.
ఇందులో హీరోయిన్‌గా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని చాలా రోజులు ఈ డైరెక్టర్ ఆలోచించాడు.
తొలుత బాలీవుడ్ హీరోయిన్ నీలమ్ కొఠారిని తీసుకుందామని అనుకున్నాడు.ఆపై ముంబైకి వెళ్లి ఆమెను కలిసి కథ చెప్పాడు.
అయితే మూవీ చేయడానికి తను ఓకే చెప్పింది కానీ కొన్ని షరతులు పెట్టింది.
తనతోపాటు ఓ హెయిర్ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ వస్తాడని నీలమ్ తెలియజేసిందట.అయితే ఇదొక మామూలు సినిమా అని దీనికి ఆ ఫెసిలిటీస్ అందించలేమని కుండబద్దలు కొట్టాడట సింగీతం.
దాంతో ఆమె చేయనని కరాకండిగా చెప్పడంతో మాధురీ దీక్షిత్( Madhuri Dixit ) ఆఫీస్‌కి వెళ్లాడు సింగీతం.
అయితే ఆమె అప్పటికే ఐరన్ లెగ్ అనే పేరు తెచ్చుకుంది.ఆమె సంతకం చేసిన నాలుగు సినిమాలు పట్టాలెక్కకుండానే అటకెక్కాయి.
అయినా ఆమెను తీసుకుందామనే ధైర్యంతో సింగీతం( Singeetam Srinivasa Rao ) వెళ్ళాడు.
ఆమె కలవలేదు.పిఏతో విషయం చెప్తే డైలాగులు లేని సినిమాలో తన మేడం నటించదని అతడు చెప్పి పంపించేసాడు.
ఆ విధంగా ఇద్దరు బాలీవుడ్ నటీమణులు ఈ మూవీలోని హీరోయిన్ రోల్ రిజెక్ట్ చేశారు.
కొద్ది రోజుల తర్వాత శ్రీనివాసరావుకు ఒక సన్మానం చేశారు.అదే ఈవెంట్ కు అక్కినేని అమల వచ్చింది.
అయితే ఆమె తన పుష్పక విమానము సినిమా లోని హీరోయిన్ పాత్రకు బాగా సూట్ అవుతుంది అనుకున్నాడు.
"""/"/
ఆమె వివరాలను అడిగితే అందరూ నెగిటివ్‌గానే చెప్పారు.ఆమెకు అసలు నటించడం రాదు అని, శివాజీ గణేశన్( Sivaji Ganesan )తో ఒకే ఒక సినిమా చేసిందని చెప్పారు.
అయినా అమలు ముఖం చూస్తే అలా అనిపించడం లేదని, చాలా నేచురల్ గా ఆమె కనిపిస్తోందని సింగీతం బదులిచ్చాడు అనంతరం సంప్రదించే కథ చెప్తే అందులో నటించడానికి ఆమె ఓకే చెప్పింది.
అలా మాధురీ దీక్షిత్ కి వెళ్లాల్సిన ఈరోజు చివరకు అమల( Amala )కు దక్కింది.
ఈ మూవీలో మాంత్రికుడి కూతురిగా అమల నటించింది.ఈ సినిమా తెలుగు, కన్నడ, మలయాళం వంటి భాషల్లో రిలీజ్ అయ్యి చాలామంది ఆకట్టుకుంది.
మాటలు లేవు కాబట్టి సౌత్ ఇండియన్ స్టేట్స్ లో సులభంగానే రిలీజ్ చేయగలిగారు.
అయితే ఈ సినిమా రిలీజ్ అయిన కొంతకాలానికి మాధురీ దీక్షిత్‌కి సింగీతం శ్రీనివాస్ వచ్చి తన పీఏని కలిసినట్టు తెలిసింది.
అతడి ద్వారా ఈ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందని నిజం తెలుసుకుంది.తర్వాత ‘మంచి ఛాన్స్ పోగొట్టావు’ అంటూ తన పీఏని ఆమె చెడామడా తిట్టేసిందట.
ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..