Allu Arjun : అల్లు అర్జున్.. ఒక సెల్ఫ్ మేడ్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు

అల్లు అర్జున్.అల్లు రామలింగయ్య కుటుంబంలో మొట్టమొదటి సక్సెస్ఫుల్ నటుడు.

నటనలో ఎవరికి సాటు లేని కమీడియన్ గా విలన్ గా ఒక వెలుగు వెలిగిన అల్లు రామలింగయ్యకు( Allu Ramalingaiah ) అసలు సిసలైన వారసుడిగా అల్లు అర్జున్ ( Allu Arjun ) మంచి పేరును సంపాదించుకున్నాడు.

తన తండ్రిని స్టార్ ని చేయాలని అనుకున్నప్పటికీ కూడా అల్లు రామలింగయ్య అందులో ఫెయిలయ్యాడు కానీ అల్లు అర్జున్ మాత్రం ఆ విషయంలో ఫెయిల్ అవ్వలేదు.

గంగోత్రి( Gangotri ) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు.మొదటి సినిమా నుంచి అందరి నుంచి విపరీతమైన నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా ఏ రకంగా కూడా తను డిప్రెషన్ కి గురి కాలేదు.

తనకి హీరో ఫేస్ కట్ లేదని మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) వంటి వ్యక్తి కుటుంబం నుంచి వచ్చిన వాడు ఇలా ఉంటాడా అని తన ఎదుట ఎంతో మంది కామెంట్స్ చేసేవారు.

ఆ మొహం అద్దంలో చూసుకోమని చెప్పిన హీరోయిన్స్ ఉన్నారు.తెలుగు సినిమా హీరోలు ఇలా కూడా ఉంటారా అని కామెంట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఉన్నారు.

అలాంటి ఒక పరిస్థితి నుంచి నేడు పాన్ ఇండియా హీరోగా, ఐకాన్ స్టార్ గా, స్టైలిష్ గా తనను తాను మలుచుకుంటూ సెల్ఫ్ మేడ్ హీరోగా ఎదిగాడు అల్లు అర్జున్.

ఈ ప్రయాణం అతడికి అంత సులభంగా ఏమీ జరగలేదు. """/" / మొదట స్టైలిష్ స్టార్ గా తనను తాను మలుచుకున్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఏ హీరోకి కూడా సాధ్యం కాని సమయంలో సిక్స్ ప్యాక్ సంపాదించి మొట్టమొదటి రికార్డు సాధించిన హీరోగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.

ఆ తర్వాత మొహాన్ని ఎన్నో రకాల సర్జరీలకు, కత్తిపోట్లకు గురి చేసుకుని తనను తాను హీరోగా చేసుకున్నాడు.

తండ్రి సహాయం కానీ, ఇండస్ట్రీలో మరెవరి సహాయం కూడా అతనికి అవసరమే లేదు అని తనను తాను మలుచుకుంటూ ఒక ఐకాన్ స్టార్ గా (icon Star)నేడు ఇండియా మొత్తం చూసే విధంగా చేసుకున్నాడు.

పండగ సీజన్ల లో చిన్న సినిమాలను రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే.?