చిన్న దెబ్బ అనుకున్నారు.. ఆ అలసత్వమే మంజుల ప్రాణాలు తీసింది..

తన అంద చందాలతో కుర్రకారుకు వెర్రెత్తించిన అలనాటి అందాల తార మంజుల.ఆమె అనుకోకుండా జరిగిన ప్రమాదంలో కింద పడి ఆస్పత్రి పాలైంది.

చివరకు చికిత్స పొందుతూనే కన్నుమూసింది.ఆమె మరణం అప్పట్లో సినిమా పరిశ్రమలో తీరని శోకాన్ని మిగిల్చింది.

ఎంతో ప్రముఖ నటీనటులు ఆమె మరణం పట్ల తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.ఇంతకీ తను ఎలా పడిపోయింది? చనిపోయేంత పెద్ద దెబ్బలు ఎం తగిలాయి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2013 జూలై 23నలో చెన్నైలోని శ్రీరామచంద్ర హాస్పిటల్లో మంజుల చనిపోయింది.అయితే తన మరణానికి గల కారణాలను తన పెద్ద కూతురు వనిత వెల్లడించింది.

మంజుల త‌మిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్ సతీమణి.విజయ్ కుమార్ కు రెండో భార్యగా మంజుల తన ఇంట్లో అడుగు పెట్టింది.

వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు.వారే వనిత‌, ప్రీతి, శ్రీ‌దేవి.

ఒకరోజు అనుకోకుండా మంజుల కింద పడింది.తలకు చిన్న దెబ్బ తగిలి వాచింది.

కాస్త ఆయింట్ మెంట్ రాసి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని కుటుంబ సభ్యులు అనుకున్నారు.

కానీ.తనకు కడుపులోనూ దెబ్బలు తగిలాయి.

కానీ ఆమె బయకు చెప్పలేదు.కొద్ది రోజుల తర్వాత కడుపులో బ్లీడింగ్ అయ్యింది.

రక్తం గడ్డకట్టి కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.దీంతో ఆమెకు విపరీతమైన వెన్నునొప్పి వచ్చింది.

కొద్ది రోజుల తర్వాత వనిత ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లింది.మంజులకు పలు రకాల టెస్టు చేసిన డాక్టర్లు ఆమె కేవలం 72 గంటల్లో చనిపోతుందని చెప్పారు.

వెంటనే తనను ఐసీయూలో అడ్మిట్ చేశారు.డాక్టర్లు చెప్పినట్లుగానే మంజుల.

ప్రాణాలు కోల్పోయింది.పక్కనే ఉన్న వనిత.

అమ్మా చూడమ్మా అని పలకరించినా.వినకుండానే వెళ్లిపోయింది.

తన తొలి బిడ్డ చేతుల్లో తలపెట్టి కన్నుమూసింది. """/"/ మంజుల త‌మిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్ సతీమణి.

విజయ్ కుమార్ కు రెండో భార్యగా మంజుల తన ఇంట్లో అడుగు పెట్టింది.

వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు.వారే వనిత‌, ప్రీతి, శ్రీ‌దేవి.

ఏపీ కేబినెట్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇవే