కోదాడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి…!

సూర్యాపేట జిల్లా:అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం ఇచ్చి,ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని సీపీఐ(ఎం.

ఎల్) ప్రజాపంథా సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్( Kothapalli Sivakumar ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బుధవారం ఉదయం సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో సుమారు వంద మంది పేదలు కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కోమరబండలో సర్వేనెంబర్ 190లో గుడిసెలు వేస్తే,ఆ గుడిసెలను రెవెన్యూ, పోలీసు వారు తీసివేశారని దీనికి నిరసనగా రంగా థియేటర్ నుంచి ఆర్డిఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి,ధర్నా నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూం( Double Bedroom ) ఇవ్వాలని లేదా 120 గజాల ఇళ్ల స్థలం కేటాయించి,ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం( KCR Govt ) వచ్చాక ప్రభుత్వ భూములు మొత్తం కబ్జాకు గురై పేదలకు దక్కకుండా ఉన్నాయన్నారు.

నిలువ నీడలేని పేదలు కిరాయిలు కట్టలేక,ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే తిసివేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా ప్రజల ఆకాంక్షలు ఏ ఒక్కటి నెరవేరలేదన్నారు.

అయినా తెలంగాణప్రభుత్వం దశాబ్ది ఉత్సవల పేరిట కోట్ల రూపాయల ప్రజధనాన్ని ఖర్చు చేస్తూ పేదలను విస్మరిస్తున్నారని అన్నారు.

తక్షణమే కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని వెలికి తీసి అర్హులైన పేదలందరికీ పంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో మా పార్టీ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంతవరకు పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐపికేఎంఎస్ రాష్ట్ర నాయకులు మట్టపల్లి అంజన్న,పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక,పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగన్న, పి.

డి.ఎస్.

యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్,ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రామోజీ, పి.

డి.ఎస్.

యూ నాయకులు పుల్లూరి సింహాద్రి పివైఎల్ నాయకులు గోపి, వీరబాబు,వెంకన్న,నాగమ్మ ,సారమ్మ,నాగలక్ష్మి, అశోక్,నాగమణి,రేణుక, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ (X) డౌన్..