అబార్షన్ హక్కులకు మద్ధతు : నాన్సీ పెలోసీపై భగ్గుమన్న క్యాథలిక్ బిషప్ .. ‘‘కమ్యూనియన్’ తీసుకోకుండా నిషేధం

అబార్షన్ హక్కుల కోసం అమెరికాలో గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున మహిళా లోకం రోడ్డెక్కిన సంగతి తెలిసిందే.

గడిచిన యాభై ఏళ్లుగా అగ్రరాజ్యంలో మహిళలు అనుభవిస్తున్న అబార్షన్ హక్కు రద్దయ్యే అవకాశాలు కనిపించడమే అందుకు కారణం.

కన్జర్వేటివ్ న్యాయమూర్తులు అబార్షన్ చట్టాన్ని రద్దు చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు.అయితే రిపబ్లికన్ జడ్జీల మెజారిటీ వున్న సుప్రీంకోర్టు నుంచి ఈ విషయమై వెలువరించాల్సిన తీర్పు పత్రాలు లీక్ కావడం అమెరికాలో సంచలనం సృష్టించింది.

దీంతో మహిళలు వేలాదిగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు.అయితే అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ అబార్షన్ హక్కులకు మద్ధతుగా నిలుస్తున్నందున క్యాథలిక్‌లు ఆమెపై మండిపడుతున్నారు.

ఈ క్రమంలో ఇకపై పెలోసీ ‘‘కమ్యూనియన్’’ తీసుకోకుండా నిషేధం విధించారు.ఈ మేరకు శాన్‌ఫ్రాన్సిస్కో ఆర్చ్ బిషప్ శుక్రవారం ఓ లేఖలో తెలియజేశారు.

ఆర్చ్ బిషప్ సాల్వటోర్ కార్డిలియోన్ .పెలోసీని ఉద్దేశించి రాసిన ఈ బహిరంగ లేఖలో ‘‘అబార్షన్‌పై పెలోసీ వైఖరి గడిచిన కొన్నేళ్లుగా, కొన్ని నెలలుగా మరింత తీవ్రమైందని వ్యాఖ్యానించారు.

అయితే దీనిపై పెలోసీ కార్యాలయం స్పందించలేదు.సాంప్రదాయిక రాష్ట్రాల్లోని చట్టసభ సభ్యులు రాష్ట్ర స్థాయిలో అబార్షన్లపై నిషేధం విధించిన తర్వాత ఫెడరల్ చట్టంలో పేర్కొన్న అబార్షన్ రక్షణలను క్రోడీకరించాలని పెలోసీ గతంలో కోరారు.

నాటి నుంచి నెలరోజులుగా ఆమెను కలుసుకోవాలని చూస్తున్నా కుదరడం లేదని బిషప్ లేఖలో పేర్కొన్నారు.

"""/"/ అంతకుముందు ఆర్చ్ బిషప్ ఏప్రిల్‌లో పెలోసీకి ఒక లేఖ పంపారు.అబార్షన్ హక్కులపై మద్ధతును ఉపసంహరించుకోవాలని.

లేదా క్యాథలిక్‌ను విశ్వసిస్తున్నట్లు బహిరంగంగా చెప్పుకోవడం మానేయాలని, లేనిపక్షంలో ‘‘కమ్యూనియన్’’ నుంచి నిషేధిస్తానని ఆయన ఆ లేఖలో హెచ్చరించారు.

ఈ నెలలో సీటెల్ టైమ్స్ ఎడిటోరియల్ బోర్డుకు పెలోసీ రాసిన వ్యాఖ్యలను కూడా కార్డిలియోన్ ప్రస్తావించారు.

క్యాథలిక్‌ను విశ్వాసిస్తున్నానని.అబార్షన్ హక్కులకు మద్ధతు ఇస్తున్నట్లు పెలోసీ చెప్పినట్లు బిషప్ వెల్లడించారు.

కాగా.అబార్షన్ హక్కులకు మద్ధతు ఇచ్చినందుకు గాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై క్యాథలిక్ మత పెద్దలు భగ్గుమన్నారు.

2019లో సౌత్ కరోలినాలోని క్యాథలిక్ చర్చిలో బైడెన్‌ ‘‘కమ్యూనియన్’’ తీసుకోవడానికి మతపెద్దలు నిరాకరించారు.

సాయి పల్లవి నుంచి శ్రీ లీల వరకు డ్యాన్స్ తో ఇరగదీసిన హీరోయిన్స్ వీళ్ళే!