పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి:గుమ్మడి నరసయ్య

సూర్యాపేట జిల్లా:నిలువ నీడ లేని నిరుపేదలకు 120 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి పట్టాలు ఇవ్వాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు.

సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ శివారు 126 సర్వే నంబర్ లో సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా,పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో పేదలతో కలిసి గుడిసెలు వేసి మాట్లాడారు.

గత 2 సంత్సరాల నుండి ఇదే సర్వే నంబర్ లో 2సార్లు గుడిసెలు వేస్తె పోలీస్లు అరెస్ట్ చేసి గుడిసెలు కూలగొట్టారని,4 సార్లు కలెక్టరేట్ ముందు ధర్నా చేసి కలెక్టర్ కు తెలియజేస్తే సోషియో ఎకనామిక్ సర్వే జరిపి అర్హులైన వారికి ఇళ్ళ స్థలం లేదా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తాను అన్నారని గుర్తు చేశారు.

2018 ఎలక్షన్స్ అప్పుడు నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని మంత్రి మాట ఇచ్చారని కానీ,నేటి వరకు ఆ వూసే లేదన్నారు.

తన అనుచరులకు ఇదే సర్వే నంబర్ లో 40 మందికి 200 గజాలు పట్టాలు ఇవ్వాలని చూశాడని,ఇదే సర్వే నంబర్ లో కోట్ల విలువ చేసే భూమి అక్రమార్కులు,అధికార పార్టీ నాయకుల కబ్జాలో ఉన్నదని ఆరోపించారు.

ప్రభుత్వ అధికారులు వారి మీద చర్యలు తీసుకోకుండా నిలువ నీడలేని పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని పోరాడుతున్న మమ్ములని,పేదలను అరెస్టులు చేసి అక్రమ కేసులు నమోదు చేయటం సరైనది కాదని అన్నారు.

ఇకనైనా మంత్రి జగదీష్ రెడ్డి,కలెక్టర్ స్పందించి అర్హులైన ప్రతి వారికి ఇళ్ళ స్థలాలు లేదా డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

లేనియెడల పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించే వరకు పోరాడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో 300 మంది ప్రజలతో పాటు ప్రజాపంథా రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు,పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక,జిల్లా అధ్యక్షరాలు చంద్రకళ,పి.

డి.ఎస్.

యు జిల్లా అదక్ష,కార్యదర్శులు ఎర్ర అఖిల్,సింహాద్రి ఐ.ఎఫ్.

టి.యు జిల్లా కన్వీనర్ రామోజీ,జయమ్మ,రేణుకా,సంతోషి,కవిత,జహంగీర్, వీరబాబు,కరుణాకర్,జిల్లా నాయకులు రామన్న తదితరులు పాల్గొన్నారు.

వర్షంలో తడుస్తూ సహాయం చేసిన సోనూసూద్.. రియల్ హీరో మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!